Madhavi Latha: జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా తిరుపతికి చెందిన కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్ చేసే ప్రతి పనిలో తన మద్దతును తెలిపే వ్యక్తి. ఇటీవల బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న కౌశిక్ ఆరోగ్య పరిస్థితిని బట్టి హీరో ఎన్టీఆర్ ఆర్థిక సహాయం చేస్తానని మాటిచ్చారు. కానీ ఈ మధ్యనే కౌశిక్ తల్లి సరస్వతి మీడియా ముందు ఎన్టీఆర్ నుంచి సహాయం అందలేదని ఆరోపించారు.
ఈ విషయంపై నటి మాధవీలత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫ్యాన్ అనేవాడు హీరోల నుంచి డబ్బులు ఆశించే వ్యక్తి కాకుండా, తమ అభిమానాన్ని చూపించేవాడిగా ఉండాలని ఆమె అన్నారు. “హీరోలు తమ ఫ్యాన్స్ అందరికీ డబ్బులు ఇస్తూ ఉంటే చివరకు రోడ్డుపైకి రావాల్సి వస్తుంది. అభిమానం అంటే ఆశించటం కాదు, ఆ ప్రేమను చూపించడమే,” అంటూ ఆమె మండిపడ్డారు.
సరస్వతికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన మాధవీలత, అభిమానానికి అసలు అర్థం చెప్పే ప్రయత్నం చేశారు. దీనిపై నెటిజన్ల నుంచి విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మాధవీలత మాటలను మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ఎన్టీఆర్ అభిమానులపై ఆమె వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.
కౌశిక్ తల్లి సరస్వతికి అనేక సంస్థలు ఇప్పటికే ఆర్థిక సహాయం అందించాయని తెలుస్తోంది. టీటీడీ నుంచి రూ.40 లక్షలు, ప్రభుత్వం నుంచి రూ.11 లక్షలు అందినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ, ఆసుపత్రి బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున ఎన్టీఆర్ సాయం చేయాలని వారు కోరుతున్నారు. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ ఇంకా స్పందించలేదు. ఈ వివాదం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.