Baby John: బేబీ జాన్ మూవీ కోసం మహాకాళేశ్వరంలో ప్రత్యేక పూజలు చేసిన టీమ్.. ఫొటోస్ వైరల్!

Baby John: బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ అలాగే టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం బేబీ జాన్. ఈ సినిమా మరికొన్ని గంటల్లోనే విడుదల కానుంది. ఈ సినిమా కోసం అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లు వంటివి సినిమాపై భారీగా అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా విడుదలకు మరికొన్ని గంటల సమయం ఉండడంతో మూవీ మేకర్స్ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేయడంతో పాటు ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ తాజాగా మహాకాళేశ్వరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అందులో భాగంగానే తాజాగా మూవీ మేకర్ మహాకాళేశ్వరం ఆలయానికి వెళ్లి ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వరుణ్ ధావన్, కీర్తి సురేష్, స్వామిక గబ్బి,నిర్మాతలు అట్లీ, ప్రియా అట్లీ కూడా ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ప్రత్యేక పూజలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు.

 

ఇకపోతే కీర్తి సురేష్ ఇటీవలే ఈ నెల 12వ తేదీన వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి చేసుకున్నప్పటికీ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో జోరుగా పాల్గొంటుంది. ఈ విషయం పట్ల కీర్తి సురేష్ ని అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇదే కాకుండా ప్రమోషన్స్ కి కీర్తి సురేష్ మంగళ సూత్రంతో హాజరు కావడం పట్ల కూడా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ బేబీ జాన్ సినిమా రేపు అనగా క్రిస్మస్ పండగ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.