టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లేడీ అసిస్టెంట్‌పై లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ కేసు కారణంగా కొంతకాలం జైలులో ఉన్న జానీ మాస్టర్ ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ ఘటన తర్వాత తన వ్యక్తిగత జీవితాన్నీ, కెరీర్‌నీ పునర్నిర్మించుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నారు.
జైలు నుండి విడుదలైన తర్వాత జానీ మాస్టర్‌ని పలువురు సపోర్ట్ చేశారు. ముఖ్యంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ జానీకి ఫోన్ చేసి ధైర్యం చెప్పినట్లు తాజా ఇంటర్వ్యూలో మాస్టర్ తెలిపారు. “స్ట్రాంగ్‌గా ఉండమని, పని మీద ఫోకస్ పెట్టమని చరణ్ అన్న మాటలు నాకు ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చాయి,” అని జానీ చెప్పారు. రిహార్సల్స్‌కి వెళ్లి మరింత ప్రాక్టీస్ చేయమని, సపోర్ట్‌గా ఉంటానని చెప్పిన చరణ్‌కు జానీ కృతజ్ఞతలు తెలిపారు.
తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాలో డోప్ సాంగ్‌ను కొరియోగ్రాఫ్ చేసిన జానీ మాస్టర్, బాలీవుడ్ మూవీ బేబీ జాన్‌లో నైన్ మాటక్క పాటకు స్టెప్పులు వేశారు. ఈ రెండు పాటలూ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమాలో కూడా ఆయనకు అవకాశం లభించినట్లు సమాచారం. ఇది జానీ మాస్టర్ కెరీర్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిందనే సంకేతాలు ఇస్తోంది. మరి, జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో రాబోయే పాటలు ఎలా ఉంటాయో చూడాలి.