Sandhya Theatre Case: సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తొక్కిసలాటకు సంబంధించి అసలు సూత్రధారిగా భావిస్తున్న అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనిని తాజాగా చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆర్గనైజర్ గా పనిచేస్తున్న ఆంటోనిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. డిసెంబర్ 4 న పుష్ప 2 ప్రిమియర్ షో సందర్భంగా సంధ్య ధియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా ఆంటోని అని పేర్కొంటున్నారు పోలీసులు.. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ బౌన్సర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయనున్నారు.
అయితే విచారణ అనంతరం అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనిని సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం సంధ్య థియేటర్ కి తీసుకెళ్లనున్నారు చిక్కడపల్లి పోలీసులు. అసలు ఆ రోజు ఏం జరిగింది ఆ సంఘటన ఎలా చోటు చేసుకుంది అన్న విషయాలు తెలియడం కోసం ఆరోజు జరిగిన ఘటనలను మళ్లీ రిపీట్ చేయనున్నారు. అలాగే ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆంటోనీతో సహా వారితో కలిసి విచారణ నిర్వహించనున్నారు. మొత్తం ఈ ఘటనలో భాగంగా 18 మందిపై కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో అల్లు అర్జున్ విచారణ పూర్తి అయిన విషయం తెలిసిందే.
సుమారు మూడున్నర గంటల పాటు విచారణ కొనసాగింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు చెప్పగా తాను పోలీస్ విచారణకు సహకరిస్తానని బన్నీ తెలిపారు. ఇంకా ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో ఎంత దూరం వెళుతుందో చూడాలి మరి. అంతేకాకుండా ఈ కేసుకి ఎప్పుడు ముగింపు పలుకుతుందో అర్థం కావడం లేదు. రోజురోజుకీ కీలక మలుపులు తిరుగుతూనే ఉంది.