Dil Raju: శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. జాబ్ ఇప్పిస్తామంటూ భరోసా!

Dil Raju: సంధ్యా థియేటర్ ఘర్షణలో గాయపడిన శ్రీతేజ్ నెమ్మదిగా కోలుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీ తేజ్ సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోరుకుంటున్నాడు. ఇప్పటికే చాలామంది ప్రముఖులు సినిమా సెలబ్రిటీలు శ్రీతేజ్ ని పరామర్శించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టాలీవుడ్ ప్రొడ్యూసర్ నిర్మాత దిల్ రాజు కూడా పరామర్శించారు. తాజాగా కిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన ఆయన రేవతి భర్త భాస్కర్ ను పరామర్శించారు. అలాగే శ్రీతేజ్ ని పరామర్శించి ఆ చిన్నారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి వద్దే మీడియాతో మాట్లాడుతూ..

రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాము. అవసరమైతే రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో పర్మినెంట్ ఉద్యోగం కూడా కల్పిస్తాము అని హామీ ఇచ్చారు దిల్ రాజు. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన సంఘటన నిజంగా దురదృష్టకరం. ఇటీవల TFDC కు చైర్మన్ గా ఇచ్చే సమయంలో ఇండస్ట్రీకు ప్రభుత్వానికి వారధిగా పని చెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇన్ని రోజులు హైదరాబాద్ లో లేకపోవడంతో హాస్పిటల్ కు రాలేకపోయాను. నగరానికి రాగానే సీఎం ను కలిశాను. రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో ఉద్యోగం ఇచ్చే ఆలోచన గురించి సీఎంకు చెప్పాను. దీని పై స్పందించిన రేవంత్ రెడ్డి చాలా మంచి నిర్ణయం అని చెప్పారు.

ప్రభుత్వం వైపు నుండి ఇండస్ట్రీకు అన్ని విధాలుగా సహకారం ఉంటుందని సీఎం భరోసా కూడా ఇచ్చారు అని తెలిపారు దిల్ రాజు. ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. వారికి అండగా ఉండడంతో పాటు ఉద్యోగం కల్పించడం అన్నది చాలా గొప్ప విషయం అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు బాగానే ఉన్నా మరి టికెట్లు రేట్ల విషయంలో బెనిఫిట్ షోల విషయంలో రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు ఏం చెబుతారు అన్నది ఏ ఆసక్తికరంగా మారింది.