శివపురాణం ప్రకారం మరణానికి ముందు వచ్చే సంకేతాలు ఇవే..!

మన హిందూ ధర్మంలో ఒక మనిషి పుట్టుక ,చావు అన్ని కర్మానుసారముగా జరుగుతాయని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒక మనిషి మరణించడానికి ముందు అతనికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయని నిపుణులు వెల్లడించారు. ఈ విషయాన్ని శివపురాణంలో కూడా వెల్లడించారు. మన జీవితం దేవుడు ఆడిస్తున్న నాటకంలో ఒక పాత్ర మాత్రమే. మన పాత్ర ముగియగానే మరణం సంభవిస్తుస్తుంది. అయితే ఒక వ్యక్తి మరణించడానికి ముందు తన మరణం సంభవిస్తుంది అనటానికి కొన్ని సంకేతాలు ఉంటాయని శివుడి భార్య పార్వతి దేవి చెప్పినట్లు శివపురాణంలో ఉంది. మరణం సంభవించడానికి ముందు కనిపించే కొన్ని సంకేతాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శివ పురాణం ప్రకారం ఒక వ్యక్తి శరీరం రంగు తెలుపు లేదా నీలం రంగు గా మారినప్పుడు తొందరలోనే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుందని సంకేతం. శరీర రంగు మారటం కూడా మరణం సంభవిస్తుంది అనటానికి ఒక సంకేతం. శరీరం రంగు తెలుపు నీలిరంగు గా మారినప్పుడు ఆ వ్యక్తి ఆరు నెలల్లో చనిపోతాడు అని అర్థం.

శివపురాణం ప్రకారం తీతువుపిట్ట మన ఇంటి మీద నుండి అరుస్తూ వెళ్లిన లేదా అర్ధరాత్రి సమయంలో కుక్కలు ఇంటి చుట్టూ చేరి అరుస్తున్న కూడా ఆ ఇంట్లో వ్యక్తి మరణించడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. అలాగే ఒక మనిషి తన జీవితంలో కఫ, పిత్త , వాత  అనే త్రి దోషాలు ఏకకాలంలో కలిగితే ఆ వ్యక్తి తొందరలో మరణిస్తాడు అని అర్థం.

అకస్మాత్తుగా ఇంట్లోకి నీలి రంగులో ఉన్న ఈగలు రావటం, ఆ ఈగలు ఒక వ్యక్తిని చుట్టుముట్టినప్పుడు ఆ వ్యక్తికి తొందరలోనే మరణం సంభవిస్తుందని అర్థం.అలాగే ఒక వ్యక్తి ఎడమ చెయ్యి తరచూ మెలికలు తిరుగుతూ ఉంటే నెల రోజుల్లో ఆ వ్యక్తి మరణిస్తాడు అని అర్థం. అంతేకాకుండా ఒక వ్యక్తి రంగులు గుర్తించడంలో ఇబ్బందిపడుతూ ప్రతి వస్తువు నలుపు రంగులో కనిపిస్తుంటే ఆ వ్యక్తికి మరణం తొందరగా సంభవిస్తుందని శివపురాణంలో వెల్లడించారు.