Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసింది రేవంత్ అనుచరులేనా… అడ్డంగా దొరికిపోయారుగా?

Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చోటు చేసుకున్నటువంటి వివాదం తారా స్థాయికి చేరుకుంది. ఈ విషయం కాస్త పొలిటికల్ పరంగా యూటర్న్ తీసుకోవడంతో పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీలోను అలాగే రెండు రాష్ట్రాల రాజకీయాలలో కూడా సంచలనంగా మారింది. ఈ ఘటనలో అల్లు అర్జున్ ప్రధాన నిందితుడిగా చేస్తూ ఆయనని అరెస్టు చేయడం పట్ల పూర్తిగా అభిమానులు సినీ సెలబ్రిటీలు ఖండించారు.

ఇకపోతే ఈ విషయంపై బాధిత కుటుంబానికి అండగా నిలవాలి అంటూ పలువురు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇలా గేటు ఆవరణంలోకి వెళ్లి పూల కుండీలు అన్నింటిని కూడా ధ్వంసం చేశారు ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి అయితే ఇక్కడ దాడి చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి అనుచరులే అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారా అనే సందేహాలు కూడా అందరికీ కలుగుతున్నాయి.

ఇలా అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసినటువంటి వారు OU జేఏసీ విద్యార్థులు కాదని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా Stop Cheap Politics on allu arjun అనే హ్యాష్ ట్యాగ్ ఎక్స్ లో ట్రెండ్ అవుతోంది. అల్లు అర్జున్ ను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు చేయడమే కాకుండా ఇటీవల అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసినటువంటి వారి ఫోటోలు కూడా షేర్ చేస్తున్నారు.

ఇకపోతే వీరంతా కూడా గతంలో రేవంత్ రెడ్డి తో కలిసి ఫోటోలు తీసుకున్నారు. ఇక బన్నీ అభిమానులు ఆ ఫోటోలను కూడా బయటకు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడమే కాకుండా అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసింది స్వయంగా రేవంత్ రెడ్డి అనుచరులే అంటూ ఆధారాలతో సహా బయటపెట్టారు. దీంతో రేవంత్ రెడ్డి తీరుపై పలువురు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.