మహా శివరాత్రికి ఈ పనులు చేస్తే అన్ని సమస్యలు దూరమవుతాయట.. ఏం చేయాలంటే?

హిందువులకు అతి ముఖ్యమైన పండుగలలో మహా శివరాత్రి ఒకటనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి నెల 8వ తేదీన హిందువులు ఈ పండుగను జరుపుకోనున్నారు. శివరాత్రి రోజున ఉదయం తలస్నానం చేసి ఉపవాసం, జాగరణ చేయడం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయి. శివరాత్రి రోజున కొన్ని పనులు చేయడం ద్వారా సమస్యలు దూరం కావడంతో పాటు జీవితం సంతోషంగా ఉంటుంది.

శివరాత్రి పండుగ రోజున శివ నామస్మరణ చేయడం వల్ల శివుని అనుగ్రహాన్ని పొందడంతో పాటు కాలసర్ప దోషం, ఇతర దోషాలు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కుంకుమ, పసుపు మిశ్రమాన్ని శివలింగానికి సమర్పించడం ద్వారా కాలసర్ప దోషం దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మారేడు ఆకులపై గాయత్రీ మంత్రాన్ని రాసి, శివరాత్రి రోజున శివునికి సమర్పిస్తే శుభ ఫలితాలు చేకూరుతాయి.

శివునికి శంఖం, కౌరీ గవ్వలు, పసుపు సమర్పించడం ద్వారా బిజినెస్ లో సులువుగా సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. శివుడిని ఆరాధించడం, శివాభిషేకం చేయడం వల్ల కాలసర్ప దోషం ప్రభావాన్ని తగ్గించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. వెండి లేదా రాగి పాము ప్రతిమలను శివాలయానికి విరాళంగా ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి.

శివరాత్రి రోజున శివుడిని పూజించడం ద్వారా శివయోగం, సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం లభించే అవకాశం ఉంటుంది. శివరాత్రి రోజున రాగి పాత్రలను కొనుగోలు చేయడం వల్ల అనుకూల ఫలితాలు లభించే అవకాశాలు ఉంటాయి. శివరాత్రి రోజున శివాలయాన్ని సందర్శించడం ద్వారా మేలు జరుగుతుంది. శివరాత్రి పండుగ రోజున దేవుడిని పూజించే సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు