Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ పూర్తిగా వివాదంలో చిక్కుకున్నారు ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఈయన ఇమేజ్ పై పూర్తిగా దెబ్బ పడిందని చెప్పాలి. ఈ విధంగా సంధ్యా థియేటర్ ఘటనలో భాగంగా అల్లు అర్జున్ పూర్తిగా వివాదంలో చిక్కుకున్నారు ఏ క్షణమైనా ఈయన బెయిల్ రద్దు అయ్యి జైలుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.
ఇకపోతే ఈ విషయం కాస్త రాజకీయాల పరంగా కూడా పెద్ద ఎత్తున చర్చలకు కారణమయ్యింది. ఏకంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ గురించి చేసిన అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా తన తప్పులేదని కానీ కొంతమంది తన ప్రతిష్టలను దిగజార్చు విధంగా మాట్లాడుతున్నారు అంటూ అల్లు అర్జున్ కూడా సర్కారు తీర పట్ల అసహనం వ్యక్తం చేశారు.
ఇలా ఈ వివాదం కాస్త పెద్ద ఎత్తున చర్చలకు గొడవలకు కారణమైంది ఈ క్రమంలోనే బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ న్యాయం చేయాలి అంటూ కొందరు ఏకంగా అల్లు అర్జున్ ఇంటిపై దాడికి కూడా వెళ్లారు ఇలా గేటు ముందు కూర్చొని ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. శ్రీ తేజ్ కుటుంబాన్ని ఆదుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్లు చేయడమే కాకుండా తన ఇంటి సెక్యూరిటీ పై కూడా దాడి చేశారు అదేవిధంగా ఇంటి ఆవరణంలో ఉన్న పూల కుండీలను కూడా పగలగొట్టారు.
ఇలా అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరగడంతో ఆ సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేరని అందుకే బయటకు రాలేదని వాళ్ళ నాన్న మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. ఇక అల్లు అర్జున్ కు ముందే ఈ దాడి గురించి తెలిసే బయటకు వెళ్ళిపోయారు అంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఇందులో మాత్రం నిజం లేదని తెలుస్తుంది. అల్లు అర్జున్ ముందుగానే ఇలాంటి ఘటన జరుగుతుందని తెలిస్తే తన పిల్లలను ఎందుకు అక్కడే పెడతారు తన తల్లిదండ్రులను కూడా ఎందుకు అక్కడే పెడతారు. వారిని కూడా తీసుకు వెళ్లేవారు కదా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఘటనలో తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా అల్లు అర్జున్ ని మాత్రం ప్రధాన నిందితుడిగా చేర్చి ఆయన పరువు ప్రతిష్టలను పూర్తిగా తీసేసారని చెప్పాలి.