Ram Charan: అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాపై ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ పుష్ప సినిమా గురించి అందులో అల్లు అర్జున్ నటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అయితే ఈ సినిమా విడుదలైన కొద్దిరోజులకి అల్లు అర్జున్ అరెస్ట్ కావడం పట్ల అందరు పూర్తిగా ఖండించారు. ఇలా అల్లు అర్జున్ అరెస్టు కావడం ఒకరోజు మొత్తం జైల్లో ఉండి రావడంతో ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున సంచలనంగా మారింది.
ఇకపోతే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా గురించి రాంచరణ్ ఎక్కడ ప్రస్తావించలేదు అలాగే ఆయన అరెస్టు కావడంతో కనీసం అల్లు అర్జున్ కలవడానికి కూడా బన్నీ వెళ్లలేదు. అయితే తన గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా పుష్ప 2 సినిమా గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అమెరికాలోని డల్లాస్ లో జరిగినటువంటి ఈ సినిమా వేడుకకు బుచ్చిబాబుతో పాటు డైరెక్టర్ కుమార్ కూడా హాజరయ్యారు. ఇక సుకుమార్ రామ్ చరణ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగస్థలం సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో తన నటనకు ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందనుకున్నాను కానీ రాలేకపోయిందని తెలిపారు.
సుకుమార్ గారు ఒక గొప్ప దర్శకుడు ఆయన దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం పుష్ప 2 వాటి సినిమాలు ఎంతో అద్భుతమైన విజయాలను సాధించాయని తెలిపారు. ఇలా ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ గురించి మాట్లాడాడే తప్ప ఎక్కడ కూడా ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అలాగే అల్లు అర్జున్ నటన గురించి కూడా మాట్లాడలేదు. దీంతో రాంచరణ్ ఇప్పటికైనా పుష్ప సినిమా చూశాడా లేదా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన ఈగో హర్ట్ అయ్యిందా అడ్డు కొందరు కామెంట్లు చేస్తున్నారు.