మన దేశంలో ఎంతోమంది పెళ్లి కాకపోవడం వల్ల, పిల్లలు పుట్టకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి వాళ్లు ఒక దేవాలయాన్ని సందర్శించడం ద్వారా ఆ కష్టాలను సులువుగా దూరం చేసుకునే అవకాశం అయితే ఉంది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం పత్తికొండ గ్రామం దగ్గరలో ఉన్న ఆలయాన్ని దర్శించుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయని ఆ ఆలయాన్ని దర్శించుకున్న వాళ్లు చెబుతున్నారు.
ఇక్కడ ఉన్న కాలభైరవేశ్వర స్వామిని దర్శించుకుని ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది. ప్రస్తుతం ఈ ఆలయంలోని దేవునికి గ్రాండ్ గా ప్రతిరోజూ పూజలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిది. ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఆలయాన్ని దర్శించుకుని ఇప్పటికే ఎంతోమంది కోరిన కోరికలను నెరవేర్చుకున్నారు.
దైవభక్తి ఉన్నవాళ్లు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిదని చెప్పవచ్చు. దేశంలోని లక్షల సంఖ్యలో దంపతులు పెళ్లి కాకపోవడం, సంతానం కలగకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాంటి వాళ్లు ఈ దేవుడిని దర్శించుకుంటే మంచిది. గోవిందా శెట్టిపల్లి లింగాయత్ కృష్ణప్ప గారి అర్చకత్వంతో ప్రస్తుతం ఈ ఆలయంలో అర్చకత్వం, పూజలు జరుగుతుండటం గమనార్హం.
తిరుపతికి వెళ్లిన వాళ్లు ఈ ఆలయాన్ని మరింత సులువుగా దర్శించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కుజ దోషం, జాతకంలో ఇతర దోషాలు ఉన్నవాళ్లు సైతం ఆ దోషాలకు పరిహారాలు చేయించుకుని ఈ దేవాలయాన్ని సందర్శించుకుంటే మంచిది. పరమేశ్వరుడిని పూజించే వాళ్లు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిది.