Ananya Pandey: ‘లైగర్’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే.. కొత్త సంవత్సరానికి బాధ్యతగా స్వాగతం పలుకుతూ తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ‘ఈ ఏడాది చాలా ప్రేమను పొందాను. తనను ప్రేమించే చాలామంది వ్యక్తుల్ని కలుసుకున్నాను. రాబోవు ఏడాది ఈ ప్రేమ ఇలాగే కొనసాగాలి. ముఖ్యంగా నాతోపాటు అందరికీ మంచి ఆరోగ్యం చేకూరాలి. ఎందుకంటే చివరకు మిగిలేది అదే..’ అంటూ కాస్తంత నిర్వేదం, ఇంకాస్త వైరాగ్యాన్ని తన పోస్ట్‌లో పొందుపరచింది అనన్య పాండే.
ఇదిలావుంటే.. ఆదిత్యరాయ్ కపూర్‌తో విడిపోయిన ఈ అందాలభామ ప్రస్తుతం వాకర్ బ్లాంకో అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అనంత్ అంబానీ జంతు సంరక్షణ కేంద్రమైన ‘వంతారా’లో వాకర్ బ్లాంకో కీలకమైన బాధ్యతను నిర్వహిస్తున్నారు. వారిద్దరి ఇన్‌స్టా పోస్టులు కూ డా ఈ పుకార్లకు బలాన్నిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.