కోరికలను తీర్చే ఈ దైవం గురించి మీకు తెలుసా.. ఈ ఆలయం ఎక్కడంటే?

మనలో చాలామంది కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరాలను భావిస్తూ ఉంటారు. గాంధారి మండలంలోని గుడిమెట్ గ్రామ సమీపంలో ఎత్తైన గుట్టపై, ప్రకృతి అందాల నడుమ దేవుడు కొలువై ఉండగా ఈ దేవుడిని దర్శించుకుంటే అనుకూల ఫలితాలు కలుగుతాయని చాలామంది భావిస్తారు. అతిపురాతమైన ఈ శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల దేవుని అనుగ్రహం కచ్చితంగా మనపై ఉంటుందని చాలామంది భావిస్తారు.

కామారెడ్డి – బాన్సువాడ ప్రధాన రహదారికి పక్కన మహాదేవుని గుట్ట ఉండగా మహాదేవుడిని దర్శించుకోవడానికి వెళ్లే తొలిమెట్టునే గుడిమెట్టు అని పిలవడం జరుగుతుంది. మహాదేవుని ఆలయ సమీపంలో ఉన్న గ్రామానికి గుడిమెట్టు అని ఈ విధంగా పేరు వచ్చిందని చాలామంది భావిస్తారు. శివ, శరములు అనే భక్తులు 800 సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో పూజలు చేసినట్టు తెలుస్తోంది.

మా గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఏ పనిని ప్రారంభించాలన్నా ఈ దేవుడిని మొదట దర్శించుకుంటారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఈ ఆలయంలో పూజలు చేసిన తర్వాత పనులను ప్రారంభించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. గుడిమెట్‌లోని మహాదేవుడు ఎంతో మహిమ గల దేవుడు కాగా ఇక్కడి ఆలయంలోని శివ లింగాన్ని మనసారా మొక్కుకుంటే భక్తుల కోరికలు నెరవేరతాయని చాలామంది భావిస్తారు.

మాఘశుద్ధ ఏకాదశి రోజు శివ పార్వతుల కల్యాణంతోపాటు మహా రుద్రాభిషేకం, రుద్రయాగం, రథోత్సవం కార్యక్రమాలను నిర్వహిస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయి. కాలక్రమేణా గుడిమెట్టు కాస్తా గుడిమెట్‌గా మారిందని ఈ ఆలయాన్ని మహాదేవుడి గుట్ట అని కూడా పిలుస్తారని సమాచారం అందుతోంది.