Ntr -Prashanth Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్..ఆ జానర్ లో సినిమా రాబోతుందా?

Ntr -Prashanth Neel యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో నటించిన దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి హీట్ అందుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించారు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. రాజమౌళి సినిమా తర్వాత కొరటాల డైరెక్షన్లో దేవర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు..

నిజానికి రాజమౌళి సినిమా తర్వాత సినిమా చేస్తే కచ్చితంగా ఆ హీరో ఫ్లాప్ ఎదురుకోవాల్సి వస్తుందనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. కానీ ఎన్టీఆర్ మాత్రం దేవర సినిమాతో ఆ ఫ్లాప్ సెంటిమెంటును చెరిపేశారు. ఊహించని విధంగా దేవర మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈయన తదుపరి చిత్రం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా తరువాత నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ బిజీ కాబోతున్నారు ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా మైథాలజికల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రశాంత్ స్పందించారు నా మైండ్ లో ఇలాంటి మైథాలాజికల్ సినిమా చేయాలని ఎప్పటినుంచో ఉంది కానీ అది ఎన్టీఆర్ తో చేయడం లేదని తెలిపారు. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా ఓ పిరియాడిక్ సినిమా అంటూ ఈ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి.