TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా వివాదంలో నిలిచిన అల్లు అర్జున్ కు బీజేపీ నాయకుడు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మద్దతు తెలియజేస్తూ రేవంత్ తీరు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడారని మండిపడ్డారు. ఈ తొక్కిసలాట ఘటనలో భాగంగా మహిళ చనిపోవడం నిజంగా బాధాకరం ఈ లోటును ఆ కుటుంబానికి పూడ్చలేనిది కానీ అందరూ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారిని ఆదుకోవడమే కాకుండా అండగా ఉంటామని అభయమిచ్చారు.
ఇలా పూర్తిగా ముగిసిపోయిన ఈ వివాదాన్ని రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఎంఐఎంతో కలిసి సినిమా లెవల్‌లో సీఎం రేవంత్ రెడ్డి కట్టు కథ అల్లారని బండి సంజయ్ ధ్వజమెత్తారు.పక్కా ప్లాన్ ప్రకారం అసెంబ్లీ వేదికగా సినీ ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేశారని ఆరోపించారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలుచేశారని బండి సంజయ్ తీవ్రస్థాయిలో రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని తప్పు పట్టారు.
గురుకులాలలో ఎంతోమంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని అనారోగ్యానికి గురయ్యారు. ఇటీవల ఓ విద్యార్థిని కూడా మరణించింది. అయితే ఎప్పుడైనా ఆ విద్యార్థుల వద్దకు వెళ్లి నువ్వు పరామర్శించావా లేకపోతే మరణించిన ఆ విద్యార్థిని కుటుంబాన్ని నువ్వు పరామర్శించావా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఇలా గురుకులాలలో కలుషిత ఆహారం అయ్యింది అంటే అందుకు బాధ్యత మీరు కాదా.. ఇలాంటి విషయాలలో మీకు ఒక న్యాయం మరొకరికి మరొక న్యాయమా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఇలా అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ ఆయన పట్ల విమర్శలు చేయడం పూర్తిగా మానుకోవాలని సూచించారు.