Janaki Vs State Of Kerala: న్యాయ పోరాటంలో అనుమప పరమేశ్వర్‌

మలయాళ అగ్ర నటుడు సురేశ్‌గోపి, అనుపమ పరమేశ్వరన్‌ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’(జె.ఎస్‌.కె). యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రవీణ్‌ నారాయణన్‌ దర్శకుడు. జె.ఫణీంద్రకుమార్‌ నిర్మాత. ఉత్కంఠకు గురిచేసే కోర్ట్‌ డ్రామాగా ఈ సినిమా రూపొందిందని, జానకి అనే స్త్రీ తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టు ద్వారా ఎలా ఎదుర్కొన్నది అనేదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తమని, కేసు వాదించే లాయర్‌గా సురేశ్‌గోపీ నటించారని, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తామని మేకర్స్‌ తెలిపారు.

బైజు సందోష్‌, మాధవ్‌ సురేశ్‌గోపి, దివ్య పిళ్లయి, అస్కర్‌ అలీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: రెనదివ్‌, సంగీతం: గిరీష్‌ నారాయణన్‌, జిబ్రాన్‌, నిర్మాణం: కాస్మోస్‌ ఎంటైర్టెన్మెంట్స్‌.