పెద్దలు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని చెబుతారనే సంగతి తెలిసిందే. కంటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎనో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కళ్లకు సంబంధించిన సమస్యలు ఉంటే నిత్య జీవితంలో ఎన్నో సమస్యలను ఫేస్ చేయాలి. ఏడాదికి ఒకసారి అయినా కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కంటికి సంబంధించిన సమస్యలను అధిగమించవచ్చు.
హ్రస్వదృష్టి, దూరదృష్టితో పాటు ఆస్టిగ్మాటిజమ్ లాంటి సమస్యల వల్ల పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. తొలి దశలోనే ఈ సమస్యలను గుర్తించడం వల్ల దీర్ఘకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండదు. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు ఎక్కువగా వాడేవాళ్లు కంటి ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. 20 నిమిషాలకోసారి స్క్రీన్‌ల నుంచి దృష్టి మరల్చి కనీసం 20 అడుగుల దూరాన ఉన్న వస్తువులపై 20 సెకెన్ల పాటు చూపు నిలపడం ద్వారా కంటికి మేలు జరుగుతుంది.
గ్లకోమా, కాటరాక్ట్ లాంటి సమస్యలు ఎటువంటి సంకేతాలు లేకుండా వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండేళ్లకు ఒకసారి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ సమస్యలను అధిగమించే ఛాన్స్ అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. వృద్ధుల్లో కంటి సమస్యలకు అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. వయస్సు ఏదైనా తరచూ కంటి చెకప్‌లు చేయించుకోవడమే శ్రీరామ రక్ష అని అని వైద్యులు చెబుతున్నారు.
కంటి సంబంధిత సమస్యల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. కంటి విషయంలో పొరపాట్లు చేస్తే మాత్రం జీవితాంతం ఇబ్బందులు పడాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.