పెళ్లి అనేది ప్రతి ఒక్కరి కల కాగా కొందరి విషయంలో ఆ కల సులువుగానే నెరవేరితే మరి కొందరి విషయంలో ఆ కల నెరవేరలేదు. కొన్నిసార్లు అనుకోని సంఘటనల వల్ల వివాహం ఆలస్యం కావడం జరుగుతుంది. 30 సంవత్సరాలు దాటినా పెళ్లి కాకపోతే ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావనే సంగతి తెలిసిందే. కొన్నిసార్లు మంచి సంబంధం కుదిరినా వేర్వేరు కారణాల వల్ల వివాహం ఆలస్యమవుతుంది.
అయితే 11 ఆలయాలను దర్శించుకోవడం ద్వారా సులభంగా పెళ్లి జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తిరుమంజేరి ఆలయం దర్శించుకోవడం వల్ల పెళ్లి త్వరగా జరుగుతుందని చాలామంది ఫీలవుతారు. ముదిచూర్ లో ఉన్న ఆలయం, మహాబాలిపురంలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం తిరువిడనత్తై దర్శించుకోవడం ద్వారా కూడా అనుకూల ఫలితాలు వస్తాయి.
ఉప్పళియప్పన్ ఆలయం, నాచ్చియార్ ఆలయం, తిరుకారుకావుర్, తిరుచ్చెరై, మధురై, తిరునల్లార్, తిరువేడగం, తిరువీలిమిలలై ఆలయాలను దర్శించుకోవడం ద్వారా కూడా అనుకూల ఫలితాలను పొందవచ్చు. పెళ్లి త్వరగా చేసుకోవాలని భావించే వాళ్లు ఈ ఆలయాలకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా చేరుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
పెళ్లి కాని వాళ్లకు ఈ ఆలయాలను దర్శించుకోవడం ద్వారా జాతకంలోని దోషాలు తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. పైన పేర్కొన్న ఆలయాలలో వేర్వేరు ఆలయాలలొ వేర్వేరు పేర్లతో దేవుడిని కొలవడం జరుగుతుంది. పరమ శివుడి ఆలయాలను దర్శించుకోవడం ద్వారా పెళ్లికి సంబంధించిన సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి.