Chandra Babu: భద్రతను భారీగా తగ్గించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు… అదే కారణమా?

Chandra Babu: సాధారణంగా ఎవరైనా అధికారంలో ఉంటే వారికి వచ్చే ఇబ్బందులు కారణంగా ఎంతో సెక్యూరిటీని పెంచుకుంటారు అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం తన భద్రతను పూర్తిగా తగ్గించుకున్నారని తెలుస్తుంది. ఇలా చంద్రబాబు నాయుడు భద్రతను తగ్గించుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. చంద్రబాబు నాయుడు తన భద్రతను తగ్గించుకోవడం వెనుక కూడా ఒక పెద్ద కారణం ఉందని తెలుస్తుంది.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఆయన తన సెక్యూరిటీకి ఒకటే విషయం చెబుతూ వస్తున్నారు సెక్యూరిటీ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టద్దని నన్ను కార్యకర్తల నుంచి దూరం చేయొద్దు అంటూ తన సిబ్బందికి తెలియచేస్తు వచ్చారు. తిరుమల వెళ్లిన సమయంలో భద్రత పేరుతో పరదాలు కట్టగా.. వెంటనే తొలగించమని చెప్పారు. ఆ తర్వాత కూడా తన కోసం గంటల తరబడి ట్రాఫిక్‌ను ఆపొద్దని సూచించారు.

సెక్యూరిటీని తగ్గించాలని ఆదేశించిన చంద్రబాబు నాయుడు భద్రతకు సంబంధించి సాంకేతికతను పెంచారు.పోలీసులు చంద్రబాబు నివాసంలో అటానమస్ డ్రోన్ల సాయంతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అంటే సెక్యూరిటీ సిబ్బందిని తగ్గించి.. టెక్నాలజీ సాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అందుకు అనుకూలంగానే ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో అధికారులు డ్రోన్ల సహాయంతో పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఆయనకు పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తున్నారు.

పోలీసులు ఈ డ్రోన్ సాయంతో ముఖ్యమంత్రి షెడ్యూల్‌కు తగిన విధంగా ప్రతి రెండు గంటలకు ఒకసారి ఉండవల్లి నివాస పరిసర ప్రాంతాల్లో డ్రోన్‌తో షూట్ చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే మానిటరింగ్ టీమ్ కి సమాచారాన్ని అందవేస్తారు..చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసిన ఈ డ్రోన్ అటానమస్ విధానంలో ఆటోపైలట్‌గా ఆ సమయానికి ఎగురుతుంది. ఇలా సాంకేతికతను ఉపయోగించి ఆయన భద్రత పెంపొందించుకుంటూ సెక్యూరిటీని తగ్గిస్తున్నారని తెలుస్తోంది