Tollywood: తెలంగాణలోను ఆంధ్రాలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి చాలా అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే సినిమాలకు టికెట్ల రేట్లు పెంచడమే కాకుండా అదనపు షోలకు కూడా అనుమతి ఇస్తున్నాయి. ఈ విధంగా అదనపు షోలతో పాటు టికెట్ల రేట్లు పెంచడంతో నిర్మాతలు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఇటీవల పుష్ప సినిమా విషయంలో జరిగిన గొడవ కారణంగా టాలీవుడ్ పెద్ద ఎత్తున చర్చలు జరుపుతోంది.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాకు గాను టికెట్ల రేట్లు పెంచడం అలాగే బెనిఫిట్ షోలకు అనుమతి కూడా తెలిపింది .అయితే బెనిఫిట్ షో కారణంగా ఒక అభిమాని మరణించడంతో ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున సంచలనాలకు దారి తీసింది రేవంత్ రెడ్డి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని అలాగే టికెట్ రేట్లు కూడా పెంచమని కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇలాంటి నిర్ణయం పట్ల ఎంతోమంది సినిమా నిర్మాతలు ఒక్కసారిగా అయోమయంలో పడ్డారు. త్వరలోనే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పెద్దపెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇలా పెద్ద సినిమాలకు బెనిఫిట్ షోలు అలాగే టికెట్ల రేటు పెంచకుండా ఉంటే సినిమా ద్వారా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నిర్మాత మండలిలో సినీ సెలబ్రిటీలందరూ త్వరలోనే భేటీ కాబోతున్నారని ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యి చర్చించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
ఒకవేళ ఇదే విషయం గురించి నిర్మాతలు రేవంత్ రెడ్డి తో మాట్లాడాలి అనుకుంటే ఆయన వీరికి అపాయింట్మెంట్ ఇస్తారా అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా బెనిఫిట్ షో లకు సినిమా టికెట్స్ రేట్లు పెంచడానికి అనుమతి తెలుపుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛెంజర్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.