ఔషధ గుణాల మారేడు విశేషాలు ఇవే !

మారేడు.. సాక్షాత్తు శ్రీలక్ష్మీ స్వరూపం. త్రిమూర్తి స్వరూపమైన మారేడు వృక్షం. అయతే ఈ మారేడులో అనేక ఔషధగుణాలు ఉన్నాయి. దీనిలోని విశేషాలు తెలుసుకుందాం..
బిల్వ దళాల్లో తిక్తాను రసం, కషాయ రసం, ఉష్ణ వీర్యం ఉంటాయి. మారేడు అరుచిని పోగొడుతుంది. జఠరాగ్నిని వృద్ది చేస్తుంది. వాత లక్షణాన్ని తగ్గిస్తుంది. మలినాలను పోగొడుతుంది. శ్లేష్మాన్ని, అతిసారాన్ని తగ్గిస్తుంది. గుండె సంబంధమైన వ్యాధులను తగ్గిస్తుంది. ఇప్పుడు మారేడులోని ఏయే భాగాలు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం.


బిల్వ పత్రాలను నూరి రసం తీసి, శరీరానికి పూసుకుంటే చెమట వాసన రాదు. మారేడు వేళ్ళ కషాయం మూలశంక వ్యాధితో బాధపడుతున్నవారికి బాగా పనిచేస్తుంది. మారేడు వేళ్ళతోతో చిక్కటి కషాయంచేసి మూలాలను తడిపినట్లయితే, వ్యాధి నయమౌతుంది. ఎండిన మారేడుకాయల్ని ముక్కలు చేసి, కషాయం కాచి సేవిస్తే జ్వరం తగ్గుతుంది. మారేడు వేరు రసం తీసి, తేనెతో రంగరించి తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయి. ఈ ఔషధాన్ని రోజూ సేవిస్తూ ఉంటే ఎలాంటి అనారోగ్యాలూ కలగవు.
బిల్వపత్రాలను దంచి కళ్ళపై లేపనంలా రాసుకుంటే కంటి దోషాలు ఏమైనా ఉంటే నశిస్తాయి. ఇలా మారేడు ఆకులు, కాయలు, వేళ్ళు చెట్టులోని ప్రతి భాగం శరీరానికి మేలు చేస్తుంది. వాతావరణాన్నిమెరుగుపరుస్తుంది. అందుకే ఈ చెట్టు దైవంతో సమానం. మారేడుతో దైవారాధన చేయడం వల్ల దైవానుగ్రహంతోపాటు ఆరోగ్యం లభిస్తుంది.