తెలంగాణ రాష్ట్రంలో 10,954 జీపీఓ ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయి రెవిన్యూ వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా ప్రజలకు మంచి చేయాలని భావిస్తోంది. ఇందుకోసం గ్రామ పాలనాధికారుల నియామకం దిశగా అడుగులు వేస్తోంది. పూర్వ వీఆర్వో, వీ.ఆర్.ఏలకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇంటర్ లేదా డిగ్రీ అర్హతతో ఐదేళ్ల సర్వీస్ ఉన్నవాళ్లకు మొదట ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,954 ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వీఆర్వో, వీ.ఆర్.ఏలలో అర్హులను మొదట గుర్తించనున్నారని సమాచారం అందుతోంది. వీ.ఆర్.ఏల నుంచి క్రమ బద్ధీకరణ పొంది జూనియర్ అసిస్టెంట్లు లేదా రికార్డ్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న వాళ్లను కూడా ఈ ఉద్యోగ ఖాళీలకు పరిగణనలోకి తీసుకుంటారు.

రెవిన్యూ పరిపాలనను ప్రజలకు చేరవేయడానికి నైపుణ్యాలు, ఇతర అంశాల గురించి రాతపరీక్షను నిర్వహించడం జరుగుతుంది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిధిలో ఎంపిక చేసి జిల్లాలకు కేటాయింపులు చేయడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్లు అపాయింట్మెంట్ లెటర్లను ఇస్తారు. ఈ ఉద్యోగ ఖాళీల కోసం ప్రత్యేకంగా సర్వీస్ రూల్స్ ను పొందుపరుస్తారని తెలుస్తోంది.

వీఆర్వో, వీ.ఆర్.ఏలుగా పని చేసిన వాళ్ల నాటి సర్వీస్ ను పరిగణనలోకి తీసుకోరు. గ్రామ ఖాతాల నిర్వహణ, వేర్వేరు ధృవీకరణ పత్రాలు, నీటి వనరులకు సంబంధించిన విచారణలు ఉంటాయి. జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్లు అప్పగించే అమలు చేయాల్సిన బాధ్యత జీపీవోలపై ఉంటుంది.