మనలో చాలామంది పూజించే దేవుళ్లలో సాయిబాబా ఒకరు. తొమ్మిది గురువారాలు సాయిబాబా వ్రతం చేయడం వల్ల మంచి ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. స్త్రీలు, పురుషులు ఈ వ్రతంను ఆచరించవచ్చు. కులమతాలతో సంబంధం లేకుండా ఈ వ్రతంను ఆచరించవచ్చు. ఎవరైతే పూర్తిస్థాయిలో ఆత్మవిశ్వాసం, భక్తితో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్లకు మహత్వపూరితమైన ఫలము లభించును.
భక్తితో సాయిబాబాని పూజిస్తూ గురువారం రోజున ఈ వ్రతాన్ని మొదలుపెట్టాలి. ఉదయం సాయంత్రం ఈ పూజలను ఆచరించవచ్చు. ఒకపూట ఆహారం సేవించి ఈ పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. 9 గురువారాలు సాయిబాబా మందిరానికి వెళ్లి లేదా ఇంటిలో పూజలు చేయాలి. ఏదైనా కారణాల వల్ల భక్తులు ఇతర ప్రాంతాలకు వెళితే అక్కడ కూడా వ్రతాన్ని ఏ సందేహం లేకుండా కొనసాగించవచ్చు.
ఈ వ్రతం చేసేవాళ్లు పేదలకు అన్నదానం చేయడంతో పాటు శ్రీ వట సాయి వ్రత పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తే మంచిది. 11 మమంది శ్రీ సాయి వ్రత పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ వ్రతం చేసిన వారి ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకున్న కోరికలు తీరని వాళ్లు ఈ వ్రతం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
చివరి గురువారం రోజున 5 మంది పేదలకు అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. చివరి గురువారం రోజున పూజగదిలో పుస్తకాలను ఉంచి ఇతరులకు పంచితే తప్పనిసరిగా మంచి ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.