మెరిసే చర్మం కోసం, చర్మాన్ని శుభ్రపరచడం, మాయిశ్చరైజ్ చేయడం, సూర్యరశ్మి నుండి రక్షించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత నీరు త్రాగడం, నిద్ర సరిగ్గా పడటం మరియు చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం చాలా ముఖ్యం అని చెప్పవచ్చు. ప్రతిరోజూ చర్మాన్ని మృదువైన క్లెన్సర్ తో శుభ్రం చేయాలి. వారానికి ఒక లేదా రెండు సార్లు చర్మాన్ని మృత కణాలను తొలగించడానికి ఎక్స్‌ఫోలియేట్ చేస్తే మంచిది.
చర్మాన్ని తేమతో ఉంచడానికి ప్రతిరోజూ మాయిశ్చరైజర్ ఉపయోగించడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. సూర్యరశ్మి నుండి చర్మాన్ని కాపాడటానికి సన్‌స్క్రీన్ ఉపయోగిస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పండ్లు, కూరగాయలు, గింజలు మరియు నట్స్ వంటి పోషకాలున్న ఆహారం తీసుకోవడం ద్వారా చర్మ సంబంధిత సమస్యలు త్వరగా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగడంతో పాటు ప్రతిరోజూ 8 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి. విటమిన్ సి, నైయాసిన్‌మైడ్ మరియు హైయాలోరానిక్ యాసిడ్ వంటి చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. వ్యాయామం చేయడం వల్ల చర్మం మెరుగ్గా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి.
ధూమపానం మరియు మద్యపానం వంటివి తగ్గించడం ద్వారా చర్మ సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకుని తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా సులభంగానే మెరిసే చర్మం సొంతమయ్యే అవకాశాలుంటాయి. తేనె, కొబ్బరినూనె, అలోవేరా చర్మ సంబంధిత సమస్యలను సులువుగా దూరం చేసే ఛాన్స్ ఉంటుంది.