మనలో చాలామంది దుష్ట శక్తులు ఉన్నాయని నమ్ముతారు. దుష్ట శక్తుల వల్ల చెడు జరుగుతుందని భావించే వాళ్లు చాలామంది ఉంటారు. నెగటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉంటే మనకు చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దుష్ట శక్తులు దరి చేరకుండా ఉండాలనే కొన్ని చిట్కాలను పాటిస్తే మంచిదని చెప్పవచ్చు. మంచి నీటిలో తులసి ఆకులను కలిపి ఇంట్లో చల్లితే నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది.
ఏడాదికి ఒకసారైనా కుటుంబంలో పండితులతో యజ్ఞాలు, హోమాలు చేయించడం ద్వారా శుభ ఫలితాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంట్లో అంతటా ప్రసరించేలా ధూపం వేయడం ద్వారా అనుకూల ఫలితాలు కలుగుతాయి. జీలకర్ర, ఉప్పులను తీసుకుని బాగా కలిపి తలుపులు, కిటికీల దగ్గర ఆ మిశ్రమాన్ని చల్లడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ పెరిగి శుభ ఫలితాలు వచ్చే అవకశాలు ఉంటాయి.
పెద్దగా సౌండ్ పెట్టుకుని సంగీతాన్ని వినడం ద్వారా కూడా ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ నుక్రియేట్ చేసి దుష్ట శక్తులను దూరం చేసుకోవచ్చు. సిలికా స్ఫటికం, టైగర్ ఐరన్ స్ఫటికం, పుష్యరాగం, గోమేధికం తదితర స్ఫటికాలను ఇంట్లో ఉంచడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం, దాన, ధర్మాలు చేయడం, దైవ ప్రార్థనలు చేయడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి.
రోజూ ఇంట్లో దీపం పెట్టడం ద్వారా కూడా దేవుని అనుగ్రహం కలిగే అవకశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. స్వస్తిక్ గుర్తును ఇంటి ప్రదాన ద్వారం లేదా గోడల మీద రాయడం ద్వారా కూడా నెగిటివ్ ఫలితాలు రాకుండా చూసుకోవాచ్చు. ఈ చిట్కాలు పాటిస్తే మనతో పాటు మన కుటుంబ సభ్యులకు సైతం మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.