జలుబుకు సులువుగా చెక్ పెట్టే న్యాచురల్ చిట్కాలు ఇవే.. ఈ చిట్కాలతో ఉపశమనం!

జలుబును త్వరగా తగ్గించేందుకు, ఆవిరి పట్టడం, అల్లం టీ, తులసి, మిరియాల పాలు, ఉప్పు నీటితో పుక్కిలించడం, చల్లనివి నివారించడం, తగినంత నీరు త్రాగడం మరియు విశ్రాంతి తీసుకోవడం లాంటి చిట్కాలు పాటించవచ్చు. వేడి నీటిలో ఆవిరి పట్టడం ద్వారా ముక్కు, గొంతులో పేరుకున్న శ్లేష్మం సడలిపోతుంది, ఉపశమనం లభిస్తుంది. అల్లం టీ తాగడం వల్ల జలుబు, దగ్గు తగ్గుతాయి. తులసి ఆకులను నమిలి రసం తాగడం, లేదా తులసి టీ తాగడం జలుబును తగ్గించడంలో సహాయపడుతుంది.

మిరియాల పొడిని వేడి పాలలో కలిపి తాగడం వల్ల జలుబు తగ్గుతుంది. ఉప్పు నీటితో పుక్కిలించడం ద్వారా గొంతు నొప్పి తగ్గుతుంది. జలుబు ఉన్నప్పుడు చల్లటి ఐస్ క్రీమ్స్, పానీయాలు త్రాగడం మానుకోవడం మంచిది. జలుబు ఉన్నప్పుడు శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం అని చెప్పవచ్చు. రాత్రిపూట హ్యూమిడిఫైయర్ వాడటం ద్వారా గాలిలో తేమ ఉండి, గొంతు నొప్పి, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.

సెలైన్ డ్రాప్స్ ముక్కులో వేయడం ద్వారా ముక్కులోని శ్లేష్మం సన్నబడటానికి సహాయపడతాయి. జలుబు చేసినప్పుడు సాధారణంగా నీటిని అలానే తాగకూడదు.. వేడి చేసి తాగాలి. ఇలా చేయడం వల్ల జలుబు నుంచి కాస్తా ఉపశమనం ఉంటుంది. అదే విధంగా అదే వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కోల్డ్ తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడూ అదే నీటిలో దాల్చినపొడి కలిపి తీసుకోవచ్చు.

జలుబు చేసినప్పుడు ఆవిరిపట్టడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. దీని వల్ల మూసుకుపోయిన ముక్కురంధ్రాలు తెరుచుకుంటాయి. చాలా రిలీఫ్‌గా ఉంటుంది. అయితే, ఆవిరి పట్టేటప్పుడు కేవలం వేడినీటితో కాకుండా.. అందులో కాస్తా పసుపు, బామ్ వంటివి వేయండి. వీటితో పాటు యూకలిప్టస్ ఆయిల్ కూడా వేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా వేసిన నీటితో ఆవిరిపడితే జలుబు త్వరగా తగ్గుతుంది.