ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ ను కరిగించే అద్భుత ఔషధం.. ఇలా చేస్తే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది!

ఈ రోజుల్లో మనం తీసుకునే ఆహారం కారణంగా శరీరంలో మోతాదుకు మించి కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగి అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతోంది. ఒంట్లో కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే మొదట ఉపకాయ సమస్య తలెత్తుతుంది దాని ఫలితంగా డయాబెటిస్, రక్తపోటు, గుండెపోటు ప్రమాదాల ముప్పు పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ సమస్య నుంచి బయట పడాలంటే రోజువారి ఆహారంలో వెల్లుల్లి తీసుకోవడంతో పాటు అదనంగా రోజుకు రెండు వెల్లుల్లి రెబ్బలను ఉదయాన్నే తినాలని నిపుణులు చెబుతున్నారు.

అధిక చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు 300 మిల్లీ గ్రాములు వెల్లుల్లి రెబ్బలను రోజుకు రెండుసార్లు తింటే 8 వారాల్లో ఒంట్లో చెడు కొలెస్ట్రాలను కరిగించడంలో కీలకపాత్ర పోషిస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడైంది వెల్లుల్లిలో సహజ యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్ సమ్మేళనాలు,థియో సల్ఫినైట్ రసాయనాలు సమృద్ధిగా ఉండి ఒంట్లో చెడు మలినాలను, కొవ్వు నిల్వలను నియంత్రించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది.మరియు వెల్లుల్లి తొక్క తీసి కట్ చేసేటప్పుడు అది అల్లిసిన్ గా మారిపోతుంది.ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

తరచూ జలుబు, ముక్కు కారడం, గొంతు గరగర, గొంతు నొప్పి వంటి ఫ్లూ లక్షణాలతో బాధపడేవారు వెల్లుల్లి, అల్లం నీటిలో బాగా మరిగించి వచ్చిన కషాయాన్ని సేవిస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
రోజువారి ఆహారంలో వెల్లుల్లి నీ ఆహారంగా తీసుకుంటే వీటిలో ఉండే అల్లిసిన్ కారణంగా వెల్లుల్లి యాంటీ బయాటిన్ గా మారి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. మరియు పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని 35 శాతం తగ్గించుకోవచ్చు. వెల్లుల్లి అల్జీమర్స్, డీమెన్షియా వంటి వ్యాధులని నివారిస్తుంది.

వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నప్పటికీ వీటిని మోతాదుకు మించి తింటే అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు వెల్లుల్లి అధికంగా తింటే ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, కడుపులో మంట గుండెల్లో మంట వంటి లక్షణాలతో బాధపడాల్సి వస్తుంది.