మన దేశంలోని ప్రజలు ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపే వాటిలో బంగారం కూడా ఒకటనే సంగతి తెలిసిందే. బంగారం ధర అంతకంతకూ పెరుగుతుండటంతో రాబోయే రోజుల్లో బంగారం ధర ఏకంగా లక్ష రూపాయలకు చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే బంగారం ధర పెరగడానికి బదులుగా తగ్గనుందని తెలుస్తోంది. తులం బంగారం ధర 55,000 రూపాయలకు చేరనుందని ప్రచారం జరుగుతోంది.
బంగారం ధర తగ్గుతుందని గ్యారంటీగా చెప్పలేం కానీ ధర తగ్గే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల బంగారం ధర తగ్గే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. రాబోయే ఐదేళ్లలో బంగారం ధర భారీగా తగ్గే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం బంగారం రేటు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బంగారం సరఫరా కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.
పాత బంగారం ఎక్కువగా రీసైకిల్ అవ్వడం వల్ల సరఫరా మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. తాత్కాలిక ఆర్థిక సంక్షోభాలు కొన్ని సందర్భాల్లో బంగారం ధరలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతాయి. 2020లో కరోనా సమయంలో బంగారం ధరలు తాత్కాలికంగా పెరిగినా ఆ తర్వాత ధరలు తగ్గుముఖం పట్టాయి.
2023 సంవత్సరం చివర్లో బంగారం ధరలు భారీ స్థాయిలో పెరిగాయనే సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో బంగారం ధర పెరుగుతుందో లేదో తెలియాల్సి ఉంది. బంగారంను కొనుగోలు చేసేవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘకాలంలో బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది.