డ్రై ఐ డిసీజ్ అనేది మీ కన్నీళ్లు మీ కళ్ళకు తగినంత లూబ్రికేషన్ అందించలేనప్పుడు సంభవించే ఒక సాధారణ పరిస్థితి అనే సంగతి తెలిసిందే. కళ్లు తగినంత కన్నీళ్లను ఉత్పత్తి చేయని పక్షంలో పొడి కళ్ల సమస్య ఎక్కువగా వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. కళ్ళు తగినంత కన్నీళ్లను ఉత్పత్తి చేయలేక పొడిబారి, అసౌకర్యంగా మారడం. దీనిని కెరాటోకాన్జంక్టివిటిస్ సిక్కా అని కూడా పిలుస్తారనే సంగతి తెలిసిందే.
కంటిలో పొడిబారడం, చికాకు, ఎరుపు, ఉత్సర్గ, అస్పష్టమైన దృష్టి, కళ్ళు త్వరగా అలసిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కన్నీటి ఉత్పత్తి తగ్గడం, కన్నీటి నాణ్యత తగ్గడం, వయసు పెరగడం, హార్మోన్ల మార్పులు. మధుమేహం, థైరాయిడ్ రుగ్మతలు, స్వయం ప్రతిరక్షక వ్యాధులు ఈ సమస్యకు ఎక్కువగా కారణమవుతున్నాయి.
కాంటాక్ట్ లెన్సులు ధరించడం, పొడి వాతావరణం, ఎయిర్ కండిషనింగ్, ధూమపానం, వాహనాల నుంచి వచ్చే పొగ కంటి సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. కంటి చుక్కలు, కూల్ ప్యాక్ లేదా హాట్ ప్యాక్, కాంటాక్ట్ లెన్సుల వాడకం తగ్గించడం, పొడి వాతావరణంలో ఉండటం తగ్గించడం, కన్నీటి ఉత్పత్తిని పెంచే మందులు వాడటం ద్వారా మంచి ఫలితాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
కంటి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ద్వారా ఈ సమస్యను కొంతమేర అధిగమించవచ్చు. పెరుగుతున్న కాలుష్యం వల్ల కూడా గాలిలో దుమ్ము, ధూళి కణాలు వేగంగా కదిలే అవకాశాలు ఉంటాయి. కళ్లద్దాలను వాడటం ద్వారా ఈ సమస్యలను కొంతమేర అధిగమించవచ్చు. కంప్యూటర్ల ముందు విరామం లేకుండా పని చేయడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు