ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనవచ్చా…. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

sex-talk-1515515761

శృంగార జీవితం భార్యాభర్తల మధ్య ఎంతో మంచి అన్యోన్యతను మంచి ప్రేమానురాగాలను పెంచుతుందని భావిస్తారు. ఈ క్రమంలోనేప్రతి ఒక్కరు శృంగారంలో పాల్గొనడానికి ఆసక్తి చెబుతుంటారు శృంగార కోరికలు తగ్గటం వల్ల పెళ్లయిన కొన్ని సంవత్సరాలకు భార్యాభర్తలు శృంగారం పట్ల పెద్దగా ఆసక్తి కూడా కనబరచరు. ఈ క్రమంలోనే చాలామంది రోజుకు ఒకసారి కాకుండా ఎక్కువసార్లు శృంగారంలో కూడా పాల్గొంటూ ఉంటారా అయితే ఇలా పాల్గొనడం మంచిదేనా ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారు అనే విషయానికి వస్తే….

ఇలా రోజుకు ఒకసారి కన్నా ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనడం తప్పులేదు కానీ శృంగారం అంటే కేవలం శారీరక కలయిక మాత్రమే కాదని నిపుణులు చెబుతున్నారు. శృంగారం ఇద్దరి మధ్య ప్రేమ ఆప్యాయత అనురాగాన్ని పెంచేదని నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా శారీరక సంతోషం కోసం శృంగారంలో ఎక్కువసార్లు పాల్గొన్న ఎలాంటి ప్రయోజనాలు ఉండవని నిపుణుల అభిప్రాయం.ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం వారానికి ఒకసారి శృంగారంలో పాల్గొన్న దంపతులు ఎంతో సంతోషంగా ఉంటున్నారని చెబుతున్నారు.

శృంగార కోరికలు తగ్గడం సర్వసాధారణం యవ్వనంలో ఉన్నప్పుడు ఏర్పడే చెడు అలవాట్లు అంటే సిగరెట్లు, మందు, డ్రగ్స్, ఎక్కువమంది అమ్మాయిలతో తిరగడం లాంటివి కూడా వయసు పై బడుతున్న కొద్దీ తమ ప్రభావాన్ని చూపిస్తాయి. శృంగారం అంటే ఇద్దరు వ్యక్తుల శారీరక, మానసిక పరమైన ఉల్లాసవంతమైన చర్య అని, దీనివల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం బలపడుతుంది. శృంగారంలో పాల్గొనడం మంచిదే కానీ మితిమీరి పాల్గొనడం మంచిది కాదని నిపుణులు అభిప్రాయం.