గాయత్రి మంత్రంలో విశేషాలు ఇవే !

పరమ పవిత్రమైన మంత్రం గాయత్రి. ‘‘న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్’’ అనేది సుప్రసిద్ధమైన వాక్యం. అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావం. అయితే ఈ మంత్రంలోని విశేషాలు తెలుసుకుందాం…

Here are the highlights of the Gayatri Mantra!

‘‘ఓం భూర్భువస్సువః
ఓం తత్సవితుర్వరేణ్యం!
భర్గోదేవస్య ధీమహి
ధియోయోనః ప్రచోదయాత్|| ’’
మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం క్రింద చూడండి.
ఓం = పరమేశ్వరుడు సర్వరక్షకుడు.
భూః = సత్ స్వరూపుడు (ఉనికి కలవాడు).
భువః = చిత్ స్వరూపుడు(జ్ఞాన రూపుడు).
స్వః = ఆనంద స్వరూపుడు(దుఃఖరహితుడు).
తత్ = అట్టి సచ్చినానంద లక్షణయుక్తమైన పరమేస్వరుడు.
సవితుః = ఈ సృష్టి కర్త.
వరేణ్యం = సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు.
భర్గః = శుద్ధ స్వరూపుడు (పాప రహితుడు).
దేవస్యః = అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్యస్వరూపము.
ధీమహి = హ్రుదయాంతరాల్లో (ఆత్మలో ఏకమై)
యః = ఆ పరమేశ్వరుడు.
నః ద్యః = మా బుద్ధులను.
ప్రచోదయాత్ = సత్కర్మలయందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములు పొంద సమర్ధం చేయుగాక.
ఇది గాయత్రి మంత్ర అర్థం. సకలదేవతా స్వరూపంగా గాయత్రి భాసిలుతుంది.