అటు నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఆహ్లాదకరమైన మాటలతో, ఇటు సినిమాపై గట్టి నమ్మకంతో విడుదలచేస్తున్న ఎస్.కె. ఫిలిమ్స్ అధినేత సురేష్‌కొండేటి పవర్‌ఫుల్ డైలాగ్‌లతో `గంధర్వ` చిత్రం లిరికల్ వీడియో సాంగ్ విడుదల, సినిమా విడుదల తేదీ ప్రకటన కార్యక్రమం జరిగాయి. ఆదివారంనాడు ప్రసాద్‌ల్యాబ్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి చిత్ర హీరో సందీప్ మాధవ్, సాయికుమార్, బాబూమోహన్, చిత్ర నిర్మాత సబాని, దర్శకుడు అప్సర్, సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ తదితరులు హాజరయ్యారు.
సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్. సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం `గంధర్వ`. ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్ పై ఎస్.కె. ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. ఈ సందర్భంగా గంధర్వ చిత్ర పోస్టర్‌ను బాబూమోహన్ ఆవిష్కరించగా, జులై1న విడుదలచేస్తున్నట్లు ఛిత్ర హీరో సందీప్ మాధవ్ ప్రకటించారు. లిరికల్ సాంగ్ వీడియోను హీరో సాయికుమార్ విడుదల చేశారు.
అనంతరం బాబూ మోహన్ మాట్లాడుతూ, మాకు కోడిరామకృష్ణ గురువు. ఆ తర్వాత మా సోదరుడు వీరశంకర్. ఎందుకనో ఆయనకు నామీద కోపం. నాకు ఏ సినిమా ఇవ్వలేదు. అయితే ఈ సినిమా పూజరోజు వీరశంకర్ సినిమా చేస్తున్నాడనిపించింది. కానీ ఆ తర్వాత చెప్పారు కొత్త దర్శకుడు అప్సర్ చేస్తున్నాడని. చిత్ర కథలోని పాయింట్ కొత్తది. చెప్పడం వేరు, తీయడం వేరు. దాన్ని అప్సర్ బాగా డీల్ చేశాడు. మిలట్రీ వారుగనుక ఖచ్చితమైన అవగాహనతో సినిమా తీశాడు. అనున్నది అనుకున్నట్లు తీశాడు. సెట్లో ఎక్కడా టెన్షన్ పడలేదు. డబ్బింగ్ చెప్పేటప్పుడు మీరు అనుకున్నది వచ్చిందా అని అప్సర్‌ను అడిగితే వచ్చిందన్నారు. ఆరంభంలో మనం అనుకున్నది అనుకున్నట్లు చేస్తే అపజయమే వుండదు. నేను కూడా అంతే. ఇప్పుడు అప్సర్‌కూడా అంతే. గంధర్వ సరికొత్త ప్రయోగం. మంచి సందేశం కూడా వుంది. ఈ సినిమాను విడుదలచేస్తున్న సురేష్ కొండేటి జర్నలిస్టుగా ఆరంభంనుంచి తెలుసు. అప్పుడే అనుకున్నాను. మంచి భవిష్యత్ వుంటుందని. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ నిర్మాతగా ఎదిగాడు. గంధర్వ సినిమా విడుదలచేస్తున్నాడు. ఆయనకు నచ్చిదంటే సూపర్‌డూపర్ హిట్టే. ఈ సినిమాను అందరూ చూడాలని కోరుకుంటున్నానని అన్నారు.
సాయికుమార్ మాట్లాడుతూ, ఈ మధ్య దేశభక్తి చిత్రాలు సూపర్ హిట్ అవుతున్నాయి. వాటిలో ఎమోషన్స్ బాగా పండుతుంది. మొన్న విడుదలైన మేజర్, విక్రమ్ అందుకు ఉదాహరణలు. ఇక దర్శకుడు వీరశంకర్‌గారు గంధర్వ కథను నా దగ్గరకు తీసుకువచ్చారు. సందీప్‌తో చేయడం గాప్పగా ఫీలవుతున్నాను. గంధర్వ టైటిల్‌లో చూపించినట్లుగా 1971-2021 కథ. అయితే నా సినీ కెరీర్‌కూడా 1972 నుంచి ఇంకా కొనసాగుతుంది. నా ఫిలిం కెరీర్ యాభై ఏళ్ళ జర్నీలో గంధర్వ విడుదల కావడం ఆనందంగా వుంది. ఇందులో ప్రధానమైన పాత్ర పోషించాను. కథే చాలా కొత్త పాయింట్. ఇండియన్ తెరపై ఇప్పటివరకు రాని పాయింట్. ఇలాంటివి చెప్పడం ఈజీ. తీయడం కష్టం. దర్శకుడు అప్సర్ బాగా తీశాడు. ఆయనకు బలం వారి కుటుంబమే. వారి అమ్మగారితో మాట్లాడాను. వారి ఆశీర్వాదాలు తీసుకున్నాను. గంధ్వర్వ పాయింట్‌ను అర్థమయ్యేలా చెబితే బాగా హిట్ అవుతుందనుకున్నాను. ఆ టైంలో సురేష్‌కొండేటి రాకతో నా ఆలోచనకు పూర్లి క్లారిటీ ఇచ్చాడు. ప్రేక్షకుడిగా మొదట చూసింది తనే. ఆయన మాటపై మాకు గురి. సందీప్ ఇందులో ఫైట్స్ బాగా చేశాడు. దర్శకుడు మిలట్రీ మనిషి కాబట్టి నాతో కూడా యాక్షన్ చేయించాడు. అన్ని సినిమాలు బాగుండాలి. అందులో మా సినిమా వుండాలి. జూలై1న రాబోతుంది. డోన్ట్ మిస్.. అన్నారు.
హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ, ఇంతకుముందు కమర్షియల్ సినిమాలు చేశాను. గంధర్వ ఫిక్షన్ పాయింట్. ఎందుకు, ఏమిటి? ఎలా జరుగుతుంది? అనే ఆసక్తికరమై కథతో నిర్మాత సబాని గారు కొత్త దర్శకుడు అప్సర్‌తో బడ్జెట్‌కు వెనుకాడకుండా నిర్మించారు. సాయికుమార్, బాబూమోహన్ సినిమాలు చూసి చాలా నేర్చుకున్నాను. వీరశంకర్‌గారు బాగా గైడెన్స్ ఇచ్చేవారు. ర్యాప్ రాక్ షకీల్ సంగీతాన్ని బాగా సమకూర్చాడు. సురేష్‌కొండేటిగారు ఈ సినిమాను విడుదల చేయడానికి ముందుకు రావడంతో మా సినిమా స్థాయి పెరిగింది. దర్శకుడు అప్సర్ రాసుకున్న డైలాగ్స్, ఎమోషన్స్ బాగా పండాయి. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరినీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని అన్నారు.
దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ, ఈ కథను రెండు లైన్లలో చెప్పగానే ఓకే అన్నాను. శాండీ (సందీప్ మాధవ్) ఈ కథను నచ్చి చేశారు. నావెల్టీ కథ. అందరినీ ఇన్‌స్పైర్ చేసే సినిమా గంధర్వ. ఇండస్ట్రీలో ఎవరికీ తెలియని అప్సర్ అందరికీ కలిపేలా ఈ సినిమా తీశాడు. కరోనా సెకండ్‌వేవ్‌లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా పూర్తి చేసి విడుదలకు సిద్దం అయింది. ఈ సినిమాను సురేష్‌కొండేటి చూసి నచ్చి విడుదలచేయడం పాజిటివ్ సైన్ కనిపిస్తుంది. సందీప్ నటించడం మరింత క్రేజ్. రాక్ షకీల్ సంగీతంలో అన్ని వేరియేషన్స్ ఇచ్చాడు. టెక్నీషియన్స్ అంతా ఇష్టపడి చేశారని తెలిపారు.
జర్నలిస్టు, పంపిణీదారుడు, నిర్మాత, సంతోషం సినీవారప్రతిక పబ్లిషర్, ఎస్.కె. పిక్చర్స్ అధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ, నేను చేసిన చిత్రాలన్నీ సూపర్‌డూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. గంధర్వ దర్శకుడు అప్సర్ డెడికేషన్ బాగా నచ్చింది. మొదటినుంచీ ఆయన్ను పరిశీలిస్తున్నాను. ఓసారి అనుకోకుండా షూటింగ్ లొకేషన్‌కు వెళ్ళాను. అప్పుడు ఆయన తీసే విధానం బాగా నచ్చి ఈ సినిమా నేను విడుదలచేయాలని ఫిక్స్ అయ్యాను. అది అప్పుడు వారికి చెప్పలేదు. నేను సినిమా తొలికాపీ చూశాను. నా 31 ఏళ్ళ సినీ జర్నలిస్టు కెరీర్‌లో అందరూ కొత్తపాయింట్, భిన్నమైనదని ఇంతవరకు రాని పాయింట్ అని చెబుతుండడం విన్నాను. నా అబ్జర్‌వేషన్‌లో నేను ఇండస్ట్రీకి వచ్చాక ఇందులో వున్న కొత్తపాయింట్ ఏ ఒక్క సినిమా ఇప్పటివరకు రాలేదు. నేను రోజుకు రెండు సినిమాలు చూస్తుంటాను. అప్పట్లో వీడియో క్యాసెట్ ఆ తర్వాత డీవీడీల్లో సినిమాలు చూసేవాడిని. తర్వాత పెన్ డ్రైవ్ ఇప్పుడు ఓటిటి ఇలా కొన్ని వేల సినిమాలు చూసిన అనుభవంతో చెబుతున్నాను. జర్నలిస్టు పరిశీలనలో ఇంత గొప్పపాయింట్ ఇప్పటివరకు రాలేదు. ఇప్పటికైనా ఛాలెంజ్. ఇంతవరకు రాని గొప్ప పాయింట్ ఇందులో వుంది. నన్ను నమ్మి ఈ సినిమాను నాకు ఇచ్చారు. చాలా బాధ్యతతో తీసుకున్నా. జులై 1న సినిమా విడుదలవుతుంది. అదే రోజు ఏ సినిమా వచ్చినా అవి కూడా ఆడాలి. గంధర్వ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. పెరిగిన టికెట్ల ధరల కావచ్చు ఈ మధ్య ఓటీటీకి ప్రేక్షకులు అలవాటు అయ్యారు. అలాంటి టైంలో కొన్ని సినిమాలకు ఇటీవలే థియేటర్‌లోకి వస్తున్నారు. మొన్న వారం విడుదలైన సినిమాలు బాగా ఆడుతున్నాయి. మా గంధర్వ సినిమాకు టికెట్ రేటు పెంచకుండానే ప్రభుత్వం ప్రకటించిన రేట్లతోనే ప్రేక్షకులకు ప్రదర్శిస్తున్నాం. ఇక సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ డెడికేషన్ లాయర్ సాబ్ కవర్ ట్రైలర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌టైంలో చూశాను. ఆయన మరో దేవీశ్రీప్రసాద్ అవుతాడని నమ్మకంగా చెబుతున్నాను. ఈ సినిమా చూశాక చిన్న చిన్న కరెక్షన్లు చేస్తే బాగుంటుందని దర్శకుడిని అడిగితే ఏమనుకుంటారో అని డౌట్‌తోనే అడిగాను. ఆయన సహృదయంతోనే తన టీమ్ మహేందర్, ప్రకాష్ లతో కలిసి సరిచేసి నాకు మరలా చూపించారు. అందుకే నేను ఘంటాపదంగా చెబుతున్నాను ఇది బ్లాక్‌బస్టర్ హిట్. ఇంతకుముందు నా సినిమాలు ప్రేమిస్తే నుంచి ప్రతీదీ హిట్ అయ్యాయి. ఇక సాయికుమార్‌గారు ఎస్.ఆర్. కళ్యాణమండపంలో కీలకమైన పాత్ర పోషించారు. ఆ తర్వాత అంతమంచి పాత్ర గందర్వలో చేశారు. అదేవిధంగా బాబూమోహన్‌గారి సపోర్ట్ నేను తొలి రోజుల్లో జర్నలిస్టుగా వున్నప్పటినుంచీ అదే ప్రేమ, ఆప్యాయత, గౌరవం కనిపిస్తుంది. ఆయన ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా వుంది. ఆయన నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే వున్నారు. హీరో శాండీ (సందీప్) వంగవీటి, జార్జిరెడ్డి వంటి సినిమాలు చేశాక మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన 10కోట్ల హీరో. కానీ ఎందుకింత గేప్ తీసుకున్నారు అనిపించేది. నాకు ఈ సినిమా చూశాక అర్థమయింది ఏమంటే, ఈయనకు కథ బాగా నచ్చితేనే సినిమా చేస్తాడని. ఆయనకు ఈ సినిమా మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. ఆయన సినిమాను నేను విడుదల చేయడం ఆనందంగా వుంది. భవిష్యత్‌లో మరో కొత్త పాయింట్‌తో వస్తే నేను మీకు సపోర్ట్‌గా వుంటాను. మా బేనర్ ద్వారా మరో మంచి సినిమాకు అవకాశం ఇచ్చిన నిర్మాత సబానిగారికీ, వారి కుటుంబానికి రుణపండి వుంటానని తెలిపారు.
సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ, ఇది డ్రీమ్ నా ప్రాజెక్ట్. ఈ కథ విన్నాక నాకు అనిపించిన ఫీలింగ్. దర్శకుడు అప్సర్‌కు థ్యాంక్స్ చెబుతున్నాను. సురేష్‌కొండేటిగారు ప్రివ్యూ చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ చూశాక ఇలా తీస్తారని అనుకోలేదు అన్నారు. సెకండాఫ్ చూశాక ఇంకా ఎవరికీ సినిమా చూపించొద్దు. ఇది నేను రిలీజ్ చేస్తానని అన్నారు. ఆయన ముక్కుసూటి మనిషి ఆయన జడ్జిమెంట్ కరెక్ట్‌గా వుంటుంది. ఆయన రాకతో మా సినిమా స్థాయి పెరిగింది. కెమెరామెన్ జవహర్ రెడ్డి, నిర్మాత, ఎడిటర్ ఇలా ప్రతి ఒక్కరూ మంచి సినిమా తీశామనే ఫీలింగ్‌తో వున్నాం. మా టీమ్ సంగీతం బాగా రావడానికి సహకరించారు. హీరో శాండీ, నాకో చరిత్ర వుండాలనే సెలెక్టెడ్ సినిమాలు చేస్తుంటాడు. జార్జిరెడ్డి తర్వాత పెద్ద ఆఫర్లు తీసుకువచ్చాను. అయినా ఆయన టెంప్ట్ కాలేదు. ఆయను నచ్చితేనే సినిమా చేస్తాడు. ఈ సినిమాకు దర్శకుల టీమ్ చాలా కష్టపడ్డారు. నటీనటులు బాగా సహకరించారని చెప్పారు.
నిర్మాత సబాని మాట్లాడుతూ, మా తమ్ముడు అప్సర్ ఓ మూవీ వుంది. నన్ను నమ్మి పెట్టుబడి పెట్టమన్నాడు. మూవీ పూర్తయింది. చూశాక చాలా బాగా తీశాడు అనిపించింది. పాండమిక్‌లను ఎదుర్కొంటూ సమ్మర్‌ను తట్టుకుని చేసిన సినిమా ఇది. ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని మా సంస్థ ద్వారా రావాలనీ, తద్వారా చాలామందికి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నానని తెలిపారు.
చిత్ర దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ, గంధర్వ స్టోరీ లంచ్ టైంలో సందీప్‌కు వినిపించాను. వెంటనే చేద్దామన్నారు. అప్పటినుంచి జూలై 1 విడుదలవరకు జర్నీ సాగింది. అన్నీ అనుకున్నట్లు జరిగాయి. మొదటి ప్రివ్యూతోనే బిజినెస్ అయింది. ఇందుకు షకీల్, సందీప్ కారణం. మా గురువుగారు వీరశంకర్ మంచి సలహాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ అనుకూలించాయి. ప్రభాస్ తొలి చిత్రానికి పనిచేసిన జవహర్‌రెడ్డి మా సినిమాకు పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే అందరూ సహకరించారు. ర్యాప్ రాక్ షకీల్ చిన్న సినిమాలకు ఎ.ఆర్. రెహమాన్ లాంటి వాడు. సాయికుమార్ కథ చెప్పగానే వెరైటీగా వుందని చేద్దామన్నారు. దాంతో కొంచెం ధైర్యం వచ్చింది. ఆ తర్వాత బాబూమోహన్‌గారు కథ చెప్పగానే ఈ పాయింట్ ఇప్పటివరకు రాలేదన్నారు. మొదటి సినిమాతోనే బాగా చేశావనే ఆశీస్సులు పొందాను. అలాగే నటీనటులంతా బాగా సహకరించారు. మా కుటుంబసభ్యులు అండగా నిలిచారు. ఎవరూ టచ్ చేయని పాయింట్‌ను నేను తీశాను. ప్రతివారూ చూడాల్సిన సినిమా అని చెప్పారు.
ఇంకా సమ్మెట గాంధీ, పాల్, సూర్య (పింగ్‌పాంగ్), కెమెరామెన్ జవహఱ్‌రెడ్డి, రూపాలక్ష్మి, జయరాం, మధు తదితరులు మాట్లాడారు.