గాడ్ ఫాదర్ సినిమాలో ఉండే హైలైట్స్ ఇవే…

‘ఆచార్య’ లాంటి డిసాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాతో రెడీ అయ్యాడు. మలయాళం మూవీ ‘లూసిఫెర్’ కి రీమేక్ గా వస్తున్న ఈ మూవీ ని ఎడిటర్ మోహన్ కొడుకు జయం రవి అన్న మోహన్ రాజా డైరెక్ట్ చేసాడు. మోహన్ రాజా ఒకప్పుడు తెలుగు లో ‘హనుమాన్ జంక్షన్’ అనే సినిమా డైరెక్ట్ చేసాడు, మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ‘గాడ్ ఫాదర్’ సినిమా కి దర్శకత్వం వహించాడు.

ఈ దసరా కి రెడీ అయిన ఈ సినిమాలో కొన్ని హైలైట్స్ మీకోసం. ఒరిజినల్ వెర్షన్ ని చూస్తే కాస్త స్లో గా ఉన్నట్టు అనిపిస్తుంది..కానీ తెలుగు లో మాత్రం స్క్రీన్ ప్లే పరుగులు తీసే విధంగా డైరెక్టర్ మార్చాడట.

ఫస్ట్ హాఫ్ మొత్తం లో రెండు మూడు ఫైట్స్ మెగాస్టార్ ఫాన్స్ కి పూనకాలు రప్పించే విధంగా ఉంటుందట..ముఖ్యంగా జైలు లో వచ్చే ఫైట్ సీన్ ఇటీవల కాలం లో వచ్చిన చిరంజీవి సినిమాలలో ‘ది బెస్ట్’ గా ఉండబోతుందట.

అలాగే ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ కూడా ఒక రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ మూవీ లో విలన్ గా సత్యదేవ్ నటిస్తున్నాడు. పాజిటివ్ బజ్ మీద విడుదల అవ్వబోతున్న ఈ సినిమా అభిమానులను ఎంత వరుకు ఆకట్టుకుంటుందో చూడాలి.