డిసెంబర్ 14రోజు సోమవారం అమావాస్య. ఈరోజు ఏం చేయాలి ఏం చేస్తే ఏం ఫలితమో అనే విశేషాలను తెలుసకుందాం… ఈరోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. ప్రాతఃకాలంలో శిరఃస్నానం చేసి శివుని పంచామృతాలతోనూ, శుద్ధ గంగాజలంతోనూ అభిషేకం చేయాలి. తర్వాత శివుని బిల్వపత్రాలతో పూజించి, శివ స్తోత్రాలతో కొలిస్తే… సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరిసంపదలు లభిస్తాయని పురాన ఉవాచ. ఈ పూజను రాహుకాలంలో చేస్తే మరింత విశేషమైన ఫలితం దక్కుతుంది. పైవన్నీ కుదరని వారు శుద్ధమైన మనస్సుతో శివపంచాక్షరి జపం చేయాలి. దీనివల్ల భగవంతుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది.
సోమావతి కథ ఇదే !
సోమవతి అమావాస్య డిసెంబర్ 14న వచ్చింది. ఈరోజు ఈ కథ చెప్పుకుంటే జాతక దోషాలు పోతాయని పండితులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన కథ గురించి తెలుసుకుందాం…
ఒకానోక ఊరిలో ఒక సాదువు ఓ వర్తక వ్యాపారి కుటుంబానికి వస్తు వుండే వాడు అయన ఒకనాడు వచ్చినప్పుడు ఆమె ముఖం చూసి దివించకుండా నే వెళ్ళిపోయాడు ఆ సాదువు దివించకుండా వేల్లానికి కారణం తెలియక అ కుటుంబం చాల బాధపడింది చివరికి పురోహితున్ని పిలిచి కారణం అడుగగా ఈమెకు జాతకం చూసి ఈమెకు వివాహం జరిగితే భర్త అనతికాలం లోనే మరణిస్తాడు. అని అన్నాడు ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుంది అని చెప్పాడు అది విని దిగ్బ్రాంతి చెందిన కుటుంబ సబ్యులు పరిష్కారం చెప్పమని పురోహితున్ని అడిగారు అయన శిన్కలి ప్రాంతం లోని ఒక చాకలి స్త్రీ ని కుంకుమ అడిగి నుదుట ధరిస్తే దోషం పోతుందని అయన చెప్పారు.
వర్తకుడు ఆ అనివయతమైన కన్యను తన చిన్న కొడుకుని అక్కడికి పంపుతారు మార్గ మద్యం లో ఒక నదిని దాటాబోతుండగా వారికీ ఒక దృశ్యం కనిపించింది పప్పుడే పుట్టిన గ్రద్ద పిల్లలు ఒక పెద్ద పాము చంపు కు తినడానికి చూస్తుంది నిత్యం అక్కడ అదే జరుగుతుంది గ్రద్ద పిల్లలు పుట్టగానే వచ్చి తిని వెళ్లి పోయేది ఆరోజు అదే జరుగుతుంది కానీ ఆరోజు ఆ యువతీ దైర్యంగా అ పాముని చంపి అ గ్రద్ద పిల్లలని కాపాడింది తన పిల్లలను కాపాడినందుకు ఆ గ్రద్ద ఆ చాకలి స్త్రీ ఇంటికి దరి చూపిస్తుంది. కొన్ని నెలల పాటు అ చాకలామెకు సేవలు చేయగా ఒకానొక సోమావతి అమావాస్య నాడు ఆమె ఈ యువతికి కుంకుమని ఇచ్చింది ఆమె వెంటనే మంచి నీరు కూడా తాగకుండా రావి చెట్టుకు 108 ప్రదక్షణలు చేసింది ఆమె జాతక దోషం అంతటి తో తొలిగి పోయింది అలాగే సోమావతి అమావాస్య నాడు మౌనంగా శివున్ని ప్రార్థిస్తే రావి చెట్టుకు ప్రదక్షణలు చేసి ఈ కధను ఒక సారి గుర్తుకు చేసుకుంటే ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలిగి పోతాయి అని పండితులు పేర్కొంటున్నారు.