నెయ్యి లేదా నూనె వీటిలో దేనితో దీపాలు వెలిగించడం పుణ్యం..?

తెలుగు మాసాలు అన్నింటిలోకి కార్తీకమాసం పరమ పవిత్రమైనది. పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన ఈ కార్తీకమాసంలో నెల రోజులపాటు కార్తీకదీపం వెలిగించి ఆ పరమేశ్వరుడిని పూజించటం వల్ల ఆయన అనుగ్రహం పొందవచ్చు. కార్తీక మాసం సందర్భంగా ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ కార్తీకమాసంలో ఉదయం సాయంత్రం ఇంట్లో దేవాలయాలలో కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అయితే ఈ దీపాలు వెలిగించడానికి అనేక రకాల నూనెలు వాడుతూ ఉంటారు. కొంతమంది నూనెతో దీపాలు వెలిగిస్తే మరి కొంతమంది నెయ్యితో దీపాలు వెలిగిస్తారు. అయితే ఇలా ఈ రెండింటిలో ఏ దానితో దీపం వెలిగించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాధారణంగా కార్తీకమాసంలో ప్రతిరోజు తెల్లవారకముందే ఇంట్లో పూజ చేసి ఇంటి ముఖద్వారం వద్ద దీపాలు వెలిగించడమే కాకుండా సాయంత్రం వేళలో కూడా ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. అంతేకాకుండా ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో దేవాలయాలలో దీపాలు వెలిగించడం వల్ల కూడా పుణ్యం లభిస్తుంది. అయితే శివ పురాణం ప్రకారం ప్రతిరోజు భగవంతుని ఎదుట నెయ్యి దీపం వెలిగించడమే కాకుండా ఇంట్లో కూడా పూజ గదిలో నెయ్యి దీపాలు వెలిగించడం వల్ల ఆ ఇంట్లో సుఖసంతోషాలు వెళ్లి విరుస్తాయి. నెయ్యితో దీపాలు వెలిగించడం వల్ల ఆ నెయ్యి నుండి వచ్చే సువాసన ఇంట్లో సానుకూల శక్తిని ప్రతిబింబించేలా చేస్తుంది.

ఇలా ప్రతిరోజు నెయ్యితో దీపాలు వెలిగించడం వల్ల ఇంట్లో గాలిని శుద్ధిచేసి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అందువల్ల ఇంట్లో కుటుంబ సభ్యులకు చర్మవ్యాధులు సోకకుండా ఉంటాయి. ఇలా భగవంతుని ఎదుట కార్తీకమాసంలో నెయ్యి దీపాలు వెలిగించడం వల్ల ఆ శివుడి అనుగ్రహం లభించి పుణ్యం లభిస్తుంది. ఇలా నెయ్యి దీపాలే కాకుండా… ఆవ నూనెతో దీపాలు వెలిగించినా కూడా పుణ్యం లభిస్తుంది. అయితే భగవంతుడికి కుడివైపున నెయ్యి దీపం వెలిగించి ఎడమవైపున ఆవు నూనెతో దీపాలు వెలిగించాలి.