తరచుగా కళ్లు మండుతున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే సమస్యకు పూర్తిగా చెక్!

ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఎక్కువమందిని వేధిస్తున్న సమస్యలలో కళ్లలో మంట సమస్య కూడా ఒకటి. కళ్లలో మంట అనేది చాలా సాధారణ సమస్య, దీనికి పలు కారణాలు ఉండవచ్చు. కళ్లలో మంటకు గల కొన్ని సాధారణ కారణాలు అలెర్జీలు, పొడి కళ్ళు, కంటి ఇన్ఫెక్షన్లు, మరియు కంటి అలసట అని చెప్పవచ్చు. కొన్ని ఆహారాలు, మందులు, లేదా రసాయనాలకు అలెర్జీ ప్రతిచర్య కళ్లలో మంటను కలిగిస్తుంది.

కళ్ళు తగినంతగా తేమగా లేకపోతే, మంట, కుట్టడం మరియు దురదకు దారి తీస్తుందని చెప్పవచ్చు. వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కళ్లలో మంటను మంటను కలిగిస్తాయి. ఎక్కువసేపు స్క్రీన్ చూడటం, చదవడం, లేదా నిద్రలేమి కంటి అలసటకు దారితీసి, మంటను కలిగిస్తుంది. కనురెప్పల చుట్టూ వాపు మరియు మంట కంటి మంటకు కారణం కావచ్చు.

కంటిలో ఏదైనా దుమ్ము, ధూళి, లేదా ఇతర వస్తువు పడితే, మంట, నొప్పి మరియు కంటి నుండి నీరు కారడం వంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కొన్ని రసాయనాలు కంటికి తాకితే మంట, నొప్పి మరియు కంటిలో దెబ్బతినడం వంటివి జరగొచ్చు. గోరువెచ్చని నీటితో కనురెప్పలను శుభ్రం చేయడం వల్ల కళ్ళలోని చికాకులు తొలగిపోతాయి. కళ్లపై వెచ్చని కంప్రెస్‌లు ఉంచడం వల్ల మంట తగ్గుతుంది.

కళ్లలో మంటను తగ్గించడానికి కంటి చుక్కలు ఉపయోగించవచ్చు. అలెర్జీ వల్ల కళ్లలో మంట వస్తే, అలెర్జీ మందులు ఉపయోగించవచ్చు. కళ్లలో మంట ఎక్కువైతే, లేదా ఇతర లక్షణాలు ఉంటే కంటి వైద్యుడిని సంప్రదించండి. పెద్దలు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని చెబుతారు. కళ్ల విషయంలో తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.