ప్రస్తుతం కార్తీక మాసం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ నియమనిష్టలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ పరమేశ్వరుడికి ఇష్టమైన ఈ కార్తీకమాసంలో ఆ పరమేశ్వరుడిని ఆరాధించటం వల్ల ఆయన అనుగ్రహం పొందవచ్చు. పరమ పవిత్రమైన ఈ కార్తీకమాసంలో తెల్లవారకముందే తలంటు స్నానం చేసి శివుడి ముందు భక్తిశ్రద్ధలతో కార్తీకదీపం వెలిగించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇదిలా ఉండగా కార్తీకమాసం పూర్తయిన తర్వాత వచ్చే పాడ్యమి రోజున దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు.
ఇలా కార్తీకమాసం తర్వాత వచ్చే అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి రోజున నది జలాలలో దీపం వెలిగించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పురాణాలలో వివరించబడింది. అయితే ఇలా పాడ్యమి రోజున ప్రత్యేకంగా దీపాలు వెలిగించడానికి గల కారణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం ఒక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఎంతో సంతోషంగా ఉండేవారు. వారిలో చిన్న కోడలు పోలీకి చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ అవ్వడం ఎక్కువగా ఉండటం వల్ల అత్తగారికి చిన్న కోడలు నచ్చేది కాదు. అందువల్ల కార్తీక మాసంలో చిన్న కోడలు పోలిని వదిలి మిగిలిన నలుగురి కోడళ్ళతో కలిసి నది స్నానానికి బయలుదేరేది.
అయితే పోలీ నది స్నానం చేయకపోయినా కూడా ఇంట్లో తెల్లవారకముందే తలంటి స్నానం చేసి పెరట్లో ఉన్న పత్తి తీసి దానికి కవ్వానికి ఉన్న వెన్న రాసి ఇంట్లో దీపం వెలిగించేది. ఆ దీపం కనిపించకుండా దానిపై బుట్ట బోర్లించేది. ఇక కార్తీకమాసం చివరి దశకు వచ్చినప్పుడు అత్తగారు కావాలని ఇంట్లో పనులన్నీ పోలికి అప్పగించి మిగిలిన నలుగురి కోడలతో కలిసి నది స్నానానికి బయలుదేరింది. అయితే పోలి మాత్రం ఇంటి పనులన్నీ చక చక చకబెట్టుకొని ఎప్పటిలాగే భక్తిశ్రద్ధలతో దీపం వెలిగించింది. తీరిక లేని పనుల వల్ల పోలీ భక్తి మార్గం తప్పకపోవడం చూసి ఆమె భక్తికి మెచ్చిన దేవతలు ఆమెకు స్వర్గ ప్రాప్తి ప్రసాదించారు. అందువల్ల పాడ్యమి రోజున దీపం వెలిగించి నదిలో వదలటం వల్ల పుణ్యం లభిస్తుంది.