పూజ చేసి అగరబత్తులు వెలిగిస్తున్నారా…. అగరబత్తులు వెలిగించే సమయంలో ఈ నియమాలు తప్పనిసరి!

మన హిందూ సంప్రదాయంలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దేశ ప్రజలందరూ ప్రతిరోజు ఇంట్లో దేవాలయాలలో పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హిందూ ప్రజలు ప్రతిరోజు ఇంట్లో దేవుడి ముందు దీపం వెలిగించి ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ దేవుడిని వేడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ప్రతిరోజు ఇంట్లో ఇలా దీపారాధన చేయటం వల్ల ఆ దేవుడి అనుగ్రహం లభించి కష్టాలు దూరం అవుతాయని ప్రజల నమ్మకం. ఇక ప్రతిరోజు దేవుళ్లను పూజించే సమయంలో పువ్వులు పండ్లు సమర్పించి దేవుడి ముందు దీపం వెలిగించి ఆ తర్వాత అగర్బత్తిలను కూడా వెలిగిస్తారు.

అంతేకాకుండా మరికొంతమంది ఇంట్లో పూజ చేసిన తర్వాత ప్రతిరోజు ధూపం వేయటం, పొగ పెట్టటం వంటివి కూడా చేస్తారు. అయితే ప్రతిరోజు ఇలా ఇంట్లో అగరబత్తీలు వెలిగించి ధూపం వేయటం వల్ల ఇల్లు మొత్తం సుగంధంతో పరిమళించడమే కాకుండా ఆ సువాసనకు దేవుడు సంతోషించి ఆయన అనుగ్రహం మనపై చూపిస్తాడని ప్రజల విశ్వాసం. అంతేకాకుండా అగర్బత్తీలు వెలిగించడం వల్ల వచ్చే సువాసన వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి కుటుంబ సభ్యులు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఆప్యాయతలతో ఉంటారు. ఇలా ఇంట్లో సానుకూల ప్రభావం ఉండటం వల్ల సమస్యలకు కూడా చోటు ఉండదు.

అయితే ప్రతిరోజు పూజ చేసిన తర్వాత అగర్బత్తీలు వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుందని ఇలా ప్రతిరోజు ఇంట్లో అగర్బత్తిలను వెలిగించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను పాటించి అగర్బత్తిలను వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. శుభకార్యాలలో వెదురు ఉపయోగించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. అయితే ఇలా శుభప్రదంగా భావించే వెదురు చెక్కలతో తయారుచేసిన అగరబత్తీలను ధూపం వెలిగించడానికి కాల్చడం వల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ఇలా ప్రతికూల వాతావరణం ఏర్పడటం వల్ల కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. అంతేకాకుండా కుటుంబాలు ఎదుగుదల నిలిచిపోయి పితృ దోషం వాటిల్లుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల వెదురు చెక్కలతో తయారుచేసిన అగర్బత్తిలను పొరపాటున కూడా వెలిగించకూడదు.