మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేశ్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో లోకేశ్ ఎంతగానో కష్టపడినా ఏ మాత్రం ఫలితం లేకపోయింది. 2024 ఎన్నికల్లో కూడా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చిందనే సంగతి తెలిసిందే. మంగళగిరిలో అభివృద్ధి పనులు చేయడం ద్వారా లోకేశ్ ప్రజల మెప్పు పొందాలని ప్రయత్నిస్తున్నారు.
వైసీపీపై తరచూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసే లోకేశ్ తాజాగా వైసీపీకి సంబంధించిన భారీ కుంభకోణాన్ని బయటపెడతానని కామెంట్ చేశారు. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంపై అవనీతి కామెంట్లు ఎక్కువగా వినిపించలేదు. జగన్ సర్కార్ అవినీతికి పాల్పడిందని ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదనే సంగతి తెలిసిందే. అయితే లోకేశ్ ఆరోపణలు చేయకుండా కుంభకోణాన్ని బయటపెట్టి ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి జగన్ సర్కార్ ఏదైనా తప్పు చేసిందనే అనుమానం ఉన్నా ఎల్లో మీడియాలో అందుకు సంబంధించి ఎన్నో కథనాలు ప్రచారంలోకి వస్తాయి. అయితే ఎల్లో మీడియాకు కూడా తెలియని కుంభకోణాన్ని లోకేశ్ కనిపెట్టారంటే ఆశ్చర్యమే అని చెప్పాలి. అయితే వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తల నుంచి లోకేశ్ కామెంట్లకు సంబంధించి సెటైర్లు పేలుతున్నాయి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తప్పు చేశారో లేదో చెప్పాలని వైసీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు.
అమరావతి భూముల విషయంలో జరిగిన అక్రమాల గురించి కూడా లోకేశ్ నోరు విప్పితే బాగుంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని జగన్ సర్కార్ చెబుతుంటే చంద్రబాబు, లోకేశ్ ఎందుకు అడ్డుపడుతున్నారో చెప్పాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినప్పటికీ చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో హైదరాబాద్ లో పాలన సాగించకుండా అమరావతి నుంచి పాలించడానికి ఎందుకు ఆసక్తి చూపారని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.