‎Chiranjeevi: సీఎం చంద్రబాబును కలిసిన మెగాస్టార్.. మరోసారీ గొప్ప మనసు చాటుకున్న చిరంజీవి!

‎Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం చిరంజీవి డబ్బును సహాయం చేసి గొప్ప మనసును చాటు కున్నారు. ఇందుకు సంబంధించిన చెక్కుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మెగాస్టార్ అందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా చిరు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం అందించడంతో ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.

‎తాజాగా చిరు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి సీఎం కార్యాలయంలోనే రూ. కోటి చెక్కును అందజేశారు. తన సాయం ప్రకృతి వైపరీత్యాలు, ఇతర అత్యవసరాల వల్ల ప్రభావితమైన కుటుంబాలకు ఉపయోగపడుతుందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. చిరంజీవికి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఆయన ఎల్లప్పుడూ సామాజిక సేవలో ముందుంటారని అభినందించారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే..

‎చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. కాగా ఇటీవల చిరంజీవి తన 70 వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. అప్పుడప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నారు మెగాస్టార్. ఇకపోతే విశ్వంభర మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నారు చిరంజీవి.