వైసీపీ మంత్రి రోజా విమర్శల విషయంలో ఘాటు పెంచారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేశ్ లపై రోజా తనదైన శైలిలో విమర్శలు చేస్తుండగా ఆ విమర్శలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ తన పార్టీని సింగిల్ గా పోటీ చేయించాలంటూ రోజా విసిరిన సవాల్ గురించి పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే రోజా మాటల్లో పవన్ పై చేసిన విమర్శల కంటే వైసీపీ గెలవదేమో అనే భయమే ఎక్కువగా కనిపిస్తోంది.
2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోకుండా ఉండి ఉంటే ఎన్నికల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఉండేవని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.. జనసేన టీడీపీ 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేసే ఛాన్స్ అయితే ఉందని జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ఈ ప్రచారం వల్ల పవన్ ను రెచ్చగొట్టి జనసేన టీడీపీ కలిసి పోటీ చేయకుండా చేయాలని వైసీపీ నేతలు భావిస్తున్నారని సమాచారం.
వైసీపీ నేతలు ఈ విధంగా కామెంట్లు చేసి టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవడానికి పరోక్షంగా కారణమవుతున్నారని మరి కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఏ ఎన్నికల్లో గెలవకపోయినా వైసీపీ నేతలను మాత్రం భయపెడుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటానని ప్రకటిస్తే వైసీపీ నుంచి విమర్శల దాడి మరింత పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు పవన్ కళ్యాణ్ తరచూ వైసీపీపై విమర్శలు చేయడం గురించి నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వైసీపీ ఎన్ని సీట్లలో గెలుస్తుందో చెప్పడంతో ఆయన ఏమైనా వైసీపీ అధికార ప్రతినిధా అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి క్లారిటీ ఇచ్చి ఇప్పటినుంచి ఎన్నికల దిశగా అడుగులు వేస్తే బెటర్ అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.