ప్రణయ్‌ని చంపిది బీహారి శర్మ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితుడు దొరికాడు. ప్రణయ్ ని హత్య చేసిన నిందితుడు  సుభాష్ శర్మను పోలీసులు బీహార్ లో అదుపులోకి తీసుకున్నారు. బీహార్ కు చెందిన సుభాష్ శర్మ మారుతీరావు దగ్గర సుపారీ తీసుకొని హత్య చేశాడు. పోలీసులు 4 టింలుగా ఏర్పడి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సుభాష్ శర్మను బీహర్ కోర్టులో ప్రవేశపెట్టి కోర్టు అనుమతితో నల్గొండకు తీసుకొస్తున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు సుభాష్ శర్మను తీసుకొని పోలీసులు నల్లగొండకు చేరుకుంటారు. ఆ తర్వాత వెంటనే ఎస్పీ రంగనాధ్ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. సుభాష్ శర్మ కిరాయి హంతకుడు. గతంలో కూడా పలు హత్యలలో శర్మ ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా సుపారీలు తీసుకొని మర్డర్లు చేయడమే శర్మ పనిగా తెలుస్తోంది. ప్రణయ్ ని హత్య చేసి అత్యంత చాకచక్యంగా తప్పించుకొని  బీహార్ పారిపోయాడు. శర్మ అండ్ కో మారుతీరావు దగ్గర కోటి రూపాయలకు డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.

మారుతీరావు పోలీసుల అదుపులో ఉండటంతో విచారణలో వివరాలన్నీ వెల్లడించడంతో హంతకుడిని పట్టుకోవడ సులువైంది. అత్యంత కిరాతకంగా ప్రణయ్ ని చంపి ఏ మాత్రం భయం లేకుండా బీహార్ వెళ్లిపోయాడు శర్మ.శర్మను బీహార్ పోలీసుల సహకారంతో సమస్తిపూర్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారంట్ పై ప్రణయ్ ని విమానంలో బీహారీ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి అటు నుంచి నల్లగొండకు తీసుకొస్తున్నారు.

శర్మను అక్కడే ఎన్ కౌంటర్ చేయాలని ప్రణయ్ కుటుంబ సభ్యులు, పలువురు డిమాండ్ చేస్తున్నారు. లేట్ చేసి మరొకరు చావకముందే వాడిని చంపేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. శర్మ సుపారీలు తీసుకొని చంపడమే పని కాబట్టి వాడు మళ్లీ ఎవరినైనా చంపుతాడని వాడిని బతకనివ్వొద్దని ఎన్ కౌంటర్ చేయాలని పలువురు కోరుతున్నారు.