యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు నన్ను రేప్ చేయలేదు.. బలవంతంగా నాతో అలా చెప్పించారు.. 139 మంది రేప్ కేసులో భారీ ట్విస్టు

big twist in 139 people cheating case of victim

నాపై 139 మంది అఘాయిత్యానికి పాల్పడలేదు. యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు ఎవ్వరూ నాపై అఘాయిత్యం చేయలేదు. వాళ్లను ఇప్పటి వరకు నేను చూడలేదు.. అంటూ భారీ ట్విస్టు ఇచ్చింది ఆ యువతి.

big twist in 139 people cheating case of victim

గత కొన్ని రోజులుగా ఆ యువతి చెప్పిన మాటలన్నింటినీ తెలంగాణ మాత్రమే కాదు.. దేశమంతా విన్నది. ఇలా చేస్తారా? ఎవరైనా. 139 మంది ఆ యువతిని రేప్ చేసి మోసం చేశారంటే.. వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే.

యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు, ఇంకా ఇతర సెలబ్రిటీలందరికీ శిక్ష పడాల్సిందే అంటూ అందరూ ముక్తకంఠంతో నినదించారు.

కానీ.. ఆ కేసు ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నది. అసలు.. నాపై నేను చెప్పిన వాళ్లెవరూ అఘాయిత్యానికి పాల్పడలేదు. నాతో అలా అబద్ధం చెప్పించారు. డాలర్ బాయ్ అనే వ్యక్తి నన్ను, నా కుటుంబాన్ని బెదిరించి బలవంతంగా నాతో అలా అబద్ధం ఆడించారు.. అంటూ ఆ యువతి ఇవాళ మీడియా ముందు వాపోయింది.

సెలబ్రిటీల నుంచి, రాజకీయ నాయకుల నుంచి డబ్బులు గుంజాలన్న ఉద్దేశంతో డాలర్ బాయ్ అనే వ్యక్తి స్కెచ్ వేశాడు. దానికి నన్ను బలి పశువును చేశాడు. నన్ను పావులా వాడుకొని సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను దీనిలోకి లాగాడు.. అంటూ ఆ యువతి వెల్లడించింది.

ఇప్పటికే దీనికి సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఆ యువతి ఫిర్యాదు ప్రకారం.. పోలీసులు పలు ఐపీసీ సెక్షన్ల ద్వారా కేసులు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు కూడా వేగవంతంగా నడుస్తున్న సమయంలో ఈ యువతి ఇటువంటి ట్విస్ట్ ఇవ్వడంతో ఏం చేయాలో పోలీసులకు తెలియడం లేదు.

ఇప్పటికే యంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు తమకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. సోషల్ మీడియా ద్వారా వాళ్లు తమపై వస్తున్న ఆరోపణలను కొట్టిపడేశారు. తాజాగా.. ఆ యువతి కూడా సినిమా సెలబ్రిటీలెవరూ తనపై అఘాయిత్యం చేయలేదని.. కాకపోతే తనపై లైంగిక దాడి జరిగిన విషయం మాత్రం వాస్తవమని తెలిపింది.

తనతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలను డాలర్ బాయ్ ఇలాగే ట్రాప్ చేసి సెలబ్రిటీలను ఇరికించాలని చూస్తున్నాడని ఆ యువతి తెలిపింది. అసలు నిజాలు తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ డాలర్ బాయ్ ఎవరో తెలియాల్సిందే. ఇప్పుడు ఇక.. పోలీసులు డాలర్ బాయ్ వేటలో పడ్డారు. చూద్దాం.. ఈ కేసులో ఇంకా ఎన్ని ట్విస్టులు ఉన్నాయో?