మిర్యాల‌గూడ ఎమ్మెల్యేకి క‌రోనా

తెలుగు రాష్ర్టాల్లో క‌రోనా ఏ స్థాయిలో ఉజృంభిస్తుoదో చెప్పాల్సిన ప‌నిలేదు. వాతావ‌ర‌ణం కూడా చ‌ల్ల‌బ‌డ‌టంతో వైర‌స్ మ‌రింత‌గా పంజా విసురుతోంది. ఇప్ప‌టికే చాలా మంది ప్ర‌జాప్ర‌తినిధులు స‌హా కొవిడ్ బారిన ప‌డి కోలుకున్నారు. కొంత మంది మృతి చెందిన సంఘ‌ట‌న‌లు ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాష్ర్టంలో మ‌రో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేకు క‌రోనా సోకింది. న‌ల్గొండ జిల్లా మిర్యాల‌గూడ‌కు చెందిన న‌ల్ల‌మోతు భాస్క‌ర‌రావుకి నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. రెండు రోజుల కింద‌ట ఆయ‌న జ‌లుబు, ద‌గ్గు రావ‌డంతోపాటు, క‌రోనా ల‌క్ష‌ణాలు కనిపించ‌డంతో కొవిడ్ ప‌రీక్ష చేయించుకోగా వైర‌స్ ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయింది.

దీంతో ఆయ‌న హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. క‌రోనాకి వాడే మందులు వాడుతూ…డాక్ట‌ర్లు సూచ‌న‌లు, స‌ల‌హాలు తీసుకుంటూ మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేలా జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే ఆయ‌న అనుచ‌రులు, స్థానిక టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు మాత్రం ఆందోళ‌న చెందుతున్నారు. ఇక తెలంగాణ‌లో బుధ‌వారం 1597 పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. ఒక్క జీహెచ్ ఎంసీలోనే 796 కేసులు న‌మోద‌య్యాయి. మిగ‌తా కేసులు రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల్లో న‌మోదైన‌వి. దీంతో ఆ రాష్ర్టంలో ఇప్ప‌టివ‌ర‌కూ క‌రోనా కేసులు మొత్తం39,342 గా ఉన్నాయి.

ఇప్ప‌టికే అధికార పార్టీకి చెందిన ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు కొవిడ్ బారిన పడి ప్ర‌యివేటు ఆసుప‌త్రుల్లో చికిత్స తీసుకుంటు న్నారు. ఈ నేప‌థ్యంలో వాళ్లంతా ప్ర‌భుత్వ ఆసుప‌త్రులైన గాంధీ, నిమ్స్, ఉస్మానియా ఆసుప‌త్రుల్లో క‌రోనా చికిత్స చేయించుకో వాలని బీజేపీ, కాంగ్రెస్ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే సామాన్యుడికి  క‌రోనా సోకితే ఎన్ని ఇబ్బందులు ప‌డుతున్నారో? అర్ధ‌మ‌వుతుంద‌ని అన్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వం క‌రోనా ప‌ట్ల ఎంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌రిస్తుందో తాజా ప‌రిస్థితుల‌ను బ‌ట్టి అర్ధ‌మ‌వు తోంది. ఇటీవ‌ల కురుస్తోన్న వ‌ర్షాల‌కు ప్ర‌భుత్వ ఆసుప‌త్రులు ఎంత ఘోరంగా ఉన్నాయో కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఆసుప త్రిలోప‌ల రోగుల మంచాల క్రింద నుంచి వ‌ర్షం నీరు…వ‌ర‌ద నీరులా పారుతోంది. వాటిని ప‌ట్టించుకోకుండా కేసీఆర్ కొత్త‌గా పాత స‌చివాల‌యాన్ని కూల్చేసి 500 కోట్ల‌తో కొత్త స‌చివాల‌యం నిర్మిస్తుడ‌టంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లు వెత్తుతోన్న సంగ‌తి తెలిసిందే.