మిర్యాలగూడ అమృత-ప్రణయ్ లవ్ స్టోరీ పై సంచలనాల రాంగోపాల్ వర్మ `మర్డర్` టైటిల్ లో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించి సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా నిన్న రిలీజ్ చేసారు వర్మ. అయితే ఈ కథతో సినిమా తీయడంపై…ఫస్ట్ లుక్ పోస్టర్ పై అమృత సీరియస్ అయింది. ఆ పోస్టర్ చూసి ఆత్మ హత్య చేసుకోవాలనిపిస్తుందని…మరిచిపోతున్న గతాన్ని మళ్లీ తవ్వి సినిమా చేయడం..వాస్తవాలకు విరుద్దంగా సినిమా ఉంటుందని అమృత కామెంట్ చేయడం వివాదాస్పదంగా మారింది. తాజాగా ఆ వ్యాఖ్యలపై వర్మ కౌంటర్ ఎటాక్ కి దిగారు. ట్విటర్ వేదికగా అమృత పోస్ట్ కు రిప్లై ఇచ్చారు. నేను రిలీజ్ చేసిన పోస్టర్లో ఒక జీవిత కథ ఆధారంగా సినిమా తీస్తున్నానని చెప్పాను.
కానీ నేను తీసిందే నిజమని ఎక్కడా చెప్పుకోలేదన్నారు. గతంలో నేను తీసిన కొన్ని జీవిత కథలని ప్రేక్షకులు ఆదరించారు. కొందరిని మంచివారిగా.. మరికొందరిని చెడువారిగా చూపిస్తున్నానంటూ అనుకోవడం మూర్ఖత్వం అవుతుందన్నారు. సమాజంలో ఎవరూ చెడ్డ వారు కాదు. పరిస్థితులు మాత్రమే మనిషిని చెడుగా ప్రవర్తించేలా చేస్తాయని బలంగా నమ్ముతానన్నారు. ఆ విషయంలో అమృత అయినా కావొచ్చు. మరొకరైనా కావొచ్చు. అమృత బాధను అర్ధం చేసకోగలను. ఆమెపై నాకు గౌరవం ఉందన్నారు. చిత్తశుద్దితో వారి బాధలను గౌరవిస్తాను అన్నారు.
మర్డర్ సినిమాలో వారు ఎదుర్కొన్న పరిస్థితులనే చూపిస్తాను. అవాస్తవాలుగానీ, కల్పితాలు గానీ సినిమాలో ఎక్కడా ఉండవన్నారు. అయితే అమృత చేసిన పోస్ట్ ఆమె చేసింది కాదని మరో ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. ఇందులో వాస్తవాలు తేలాల్సి ఉంది. అమృత-ప్రణయ్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న అనంతరం అమృత తండ్రి మారుతిరావు ప్రణయ్ ని కిరాయి రౌడీలతో చంపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జైలుకెళ్లి బెయిల్ పై వచ్చిన మారుతిరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇలా మూడు కోణాల్లో వర్మ సినిమా ఉంటుందని తెలుస్తోంది. బయోపిక్ లు చేయడం వర్మకు కొట్టిన పిండి అని చెప్పాల్సిన పనిలేదు.