పబ్లిసిటీ పీక్… మ్యాటర్ వీక్ అంటూ జగన్ మీద లోకేష్ సెటైర్లు

Nara lokesh hot comments on cm jagan

ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ చేస్తూ హై కోర్ట్ ఉత్తర్వులివ్వటంతో రాజకీయ పార్టీలన్నీ వ్యూహ రచనలో మునిగిపోయాయి. మున్సిపల్ ఎన్నికలు అంటే దాదాపు పట్టణ జనాభా అధికంగా ఉండేవే కాబట్టి… వైసీపీకి భయం పట్టుకుంది. మధ్యతరగతి ప్రజలు జగన్ తో ఏమాత్రం సింక్ కాలేకపోతున్నారు. ధరల భారం వారిని వెంటాడుతుంది. జగన్ పెంచిన కరెంటు భారం, ట్యాక్సులు పడేది కూడా వీళ్లపైనే. పల్లెల్లో ఎవరూ ఏ ట్యాక్స్ కట్టరు. కానీ పట్టణాల్లో ప్రభుత్వాలు మోపే ప్రతి భారం ప్రజలకు తెలుస్తుంటుంది. అందుకే ఈ ఎన్నికల్లో విజయావకాశాలు బాగా తక్కువ అని వైసీపీ వర్గాలు భయపడుతున్నారు.

Nara lokesh hot comments on cm jagan
Nara lokesh hot comments on cm jagan

తెలుగుదేశం పార్టీ మాత్రం తమ సత్తా ఇప్పుడు చూపిస్తాం అని బల్లలు గుద్దుతూ సంబరపడుతోంది. సొంత నిధులు ఉండే మున్సిపాలిటీల్లో తెలుగుదేశానికి ఓటేస్తే మూసేసిన అన్నా క్యాంటీన్లను తెరిపిస్తాం, వీలైనంతగా స్థానిక పన్నుల భారం తగ్గిస్తాం అంటోంది తెలుగుదేశం. దీనికి తోడు మధ్యతరగతి అండ గట్టిగా ఉండటంతో తెలుగుదేశం ఫుల్ జోష్ తో ఉంది. దానికి తగ్గట్టుగానే ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది.

ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ… ‘‘పట్టణాల అభివృద్ధి కోసం 10 వాగ్దానాలతో మ్యానిఫెస్టో విడుదల చేసాం. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజల్ని కోరుతున్నాను. పురపాలక ఎన్నికల్లో గెలిస్తే ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం. 21 నెలల జగన్ రెడ్డి పాలనలో పట్టణాల అభివృద్ధి శూన్యం. కనీసం రోడ్డు పై గుంతలు పూడ్చలేని అసమర్థ ప్రభుత్వాన్ని చూసాం. ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేసాడు, మరో ఛాన్స్ ఇస్తే ప్రజల జీవితాలను నాశనం చేస్తాడు. ఆలోచించి ఓటు వెయ్యండి’’ అంటూ లోకేష్ పిలుపునిచ్చాడు.

రాష్ట్రంలో వైసీపీ పాలన చూస్తుంటే.. ‘పబ్లిసిటీ పీక్..మ్యాటర్ వీక్’ అంటూ ఎద్దేవా చేశారు. దీనికి సన్నబియ్యమే ఒక ఉదాహరణగా చెప్పారు. ‘ఎన్నికల ముందు సన్నబియ్యం ఇస్తామని చెప్పారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నబియ్యంకాదని.. నాణ్యమైన బియ్యం ఇస్తామన్నారు.. తర్వాత వేల కోట్లు ఖర్చుచేసి వాహనాలు ఏర్పాటు చేశారు. స్పీడుగా గ్రామాలకు పంపారు.. ప్రజలు ఛీ కొట్టారు.. మళ్లీ స్పీడుగా ఆ వాహనాలు తాడేపల్లి ప్యాలస్‌కు వచ్చాయని’ లోకేష్ ఎద్దేవా చేశారు. ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను అడిగి.. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా అభివృద్ధి జరగలేదని లోకేష్ విమర్శించారు.