చదువుకున్నవారు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగం రావాలని కష్టపడి పెద్ద పెద్ద చదువులు కూడా చదువుతూ ఉంటారు. అయితే గవర్నమెంట్ ఉద్యోగం సాధించడం అన్నది అంత సులువైన విషయం కాదనే చెప్పాలి. అనేక దశలు దాటుకుని వెళ్లాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ వంటివి కీలకం. వీటిలో ఉత్తీర్ణత సాధిస్తేనే ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని రకాల ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ లేదా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వీటికి సెలక్ట్ అయితే, లైఫ్ సెటిల్ అయినట్లే. అలా ఇప్పుడు కూడా రాత పరీక్ష లేకుండా ఉండే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. మరి ఇంతకీ ఆ జాబ్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. అసిస్టెంట్ డైరెక్టర్, సైంటిస్ట్-బి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్-I, సైంటిస్ట్-బి, స్పెషలిస్ట్ గ్రేడ్-III, సైంటిస్ట్ బి, ఇంజనీర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపడుతుంది. డిఫెన్స్ రంగంలో ఫైర్‌మెన్ ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఇంటర్వ్యూ లేదా ఎడ్యుకేషన్ క్వాలికేషన్‌లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు..
అదేవిధంగా ఇండియన్ రైల్వేస్ కూడా లో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, టికెట్ కలెక్టర్ వంటి పోస్టులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే అభ్యర్థులకు రిజర్వు చేస్తారు. ఈ ఉద్యోగాలను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తారు. వీటికి ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
అలాగే కేంద్ర వాణిజ్య శాఖ, తన పరిధిలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్స్ జారీ చేస్తుంది. కంటెంట్ రైటర్, ఎడిటర్, రీసెర్చర్ వంటి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు కూడా ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
ఐఆర్‌సీటీసీ… ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేస్తుంది. ఐఆర్‌సీటీసీ కొన్ని ఉద్యోగాలకు అభ్యర్థులను వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తుంది. ఈ జాబ్ కి కూడా ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు.
దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో టైపిస్ట్ ఉద్యోగాల భర్తీకి తరచుగా నోటిఫికేషన్స్ విడుదల అవుతూ ఉంటాయి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష ఉండదు. ఇంటర్వ్యూ, టైపింగ్ టెస్ట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈఎస్‌ఐసీ మెడికల్ విభాగంలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సూపర్ స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్, అడ్జంక్ట్ ఫ్యాకల్టీ వంటి పోస్ట్‌ల భర్తీకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వైద్యవిద్యలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వయోపరిమితి వంటి కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు ఉండవచ్చు.