మామిడి ఆకుల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం మామిడికాయల సీజన్. ఈ సమ్మర్ సీజన్లో మనకు మామిడికాయలు ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కేవలం మామిడి కాయల వల్ల మాత్రమే కాకుండా మామిడి ఆకుల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి మామిడి ఆకులను ఎలా తీసుకోవాలి ఎలా తీసుకుంటే మామిడి ఆకులు బాగుంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామిడి పండ్లో కూడా ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. అదే విధంగా మామిడి ఆకులను కేవలం గుమ్మాలకు కట్టడం, అలంకరణకు ఉపయోగిస్తారు.
కానీ మామిడి పండ్లతో కంటే.. మామిడి ఆకులతోనే చాలా ఉపయోగాలు ఉన్నాయి. మామిడి ఆకుల్లో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. మామిడి ఆకులను సరిగ్గా ఉపయోగిస్తే.. ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మాములుగా శరీరంపై గాయాలు అవుతూ ఉంటాయి. ఇవి అంత త్వరగా తగ్గవు. కానీ మామిడి ఆకులను ఉపయోగిస్తే త్వరగా తగ్గుతాయి. ఎందుకంటే మామిడి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా లభ్యమవుతాయి. ఇవి చర్మాన్ని అందంగా కనిపించేలా చేస్తాయి. అలాగే మామిడి ఆకులతో జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో విటమిన్ ఏ, సిలు ఉంటాయి. ఇవి కొల్లాజిన్ ఉత్పత్తికి సహాయ పడతాయి.
దీంతో అందమైన మెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది. లేత మామిడి ఆకుల పేస్టును మీరు జుట్టుకు అప్లై చేయవచ్చు. డయాబెటీస్ ఉన్నవారు మామిడి పండ్లకు దూరంగా ఉండాలి. కానీ మామిడి ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచుతుంది. మామిడి ఆకులను ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే మంచిది. మామిడి ఆకులు తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వడంలో కూడా సహాయ పడుతుంది. ముఖ్యంగా ఒబెసిటీ సమస్య తగ్గుతుంది. అదే విధంగా కడుపులో అల్సర్లు తగ్గించడంలో కూడా మామిడి ఆకులు సమర్థవంతంగా పని చేస్తాయి. జీర్ణక్రియను పెంచడంలో, కీళ్ల నొప్పులు, ఎక్కిళ్లను తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది.