వైసీపీ మేనిఫెస్టో రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. కీలక జాగ్రత్తలు ఇవే!

ఏపీలో పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. మరోపక్క నామినేషన్లకు తుది గడువు సమీపిస్తుంది. ఇక మిగిలింది.. ప్రధానంగా మేనిఫెస్టోల ప్రకటనే! ఈ విషయంలో వైసీపీ, కూటమి ఎలాంటి మేనిఫెస్టోలు ఇస్తాయనేది ఆసక్తిగా మారింది. అయితే… 2014లో కూడా టీడీపీ – బీజేపీ – జనసేన ఒక భారీ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే… ఆ మేనిఫెస్టోలోని హామీలను ఏ మేరకు అమలు చేశారంటే… టీడీపీ నేతలు స్పష్టంగా మాట్లాడలేని పరిస్థితి.

ఆ ఎఫెక్ట్ 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిన సంగతి తెలిసిందే! 2014లో కూటమి అంతా కలిసి పోటీ చేయడం.. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చినాకూడా ఆ హామీలు అమలుచేయలేకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర తిరస్కరణను ఎదుర్కొన్నారు. ఈ సమయంలో 2019లో నవరత్నాలు అంటూ సింగిల్ పేజీ మేనిఫెస్టోను విడుదల చేశారు! ఈ సమయంలో కోవిడ్ వచ్చినా కూడా.. 95శాతానికి పైగా హామీలను అమలుచేసిన విషయాన్ని గట్టిగా చెబుతున్నారు!

ఈ సమయంలో 2024 ఎన్నికల వేళ మరోసారి జగన్ ఎలాంటి మేనిఫెస్టోను తెరపైకి తెస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ సమయంలో… రానున్న ఎన్నికల నేపథ్యంలో వైఎస్ జగన్ విడుదల చేసే మేనిఫెస్టో కార్యక్రమానికి ముహూర్తం ఫిక్సయ్యిందని అంటున్నారు. ఇందులో భాగంగా… ఈ నెల 25న నామినేషన్ దాఖలు చేసిన అనంతరం… 26న తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో విడుదల చేస్తారని తెలుస్తోంది.

అవును… ఏపీలో అధికార పార్టీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైననట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా… రేపు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న వైఎస్ జగన్‌.. ఎల్లుండి అంటే ఈ నెల 26వ తేదీన తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో విడుదల చేస్తారని సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే సంక్షేమ పథకాల ఎంపిక, వాటి అమలు విషయంలో నూటికీ నూరు మార్కులు సంపాదించుకున్నారని చెబుతున్న వేళ.. అవే కంటిన్యూ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

అలా వాటికి కొనసాగిస్తూనే… గాలి మాటలు, ఊకదంపుడు హామీలు కాకుండా.. కేవలం ఆచరణకు సాధ్యమయ్యే మరికొన్ని హామీలను, ప్రజాకర్షక పథకాలను మాత్రమే జగన్‌ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే… మళ్లీ అధికారంలోకి వస్తే ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తామనే దానిపై మేనిఫెస్టోలో క్లారిటీ ఇవ్వనున్నారు. మహిళలు, రైతులు, యువత టార్గెట్‌ గా మేనిఫెస్టో ఉంటుందని అంటున్నారు. జగన్ చెబితే చేస్తాడనే నమ్మకం ప్రజల్లో పూర్తిగా ఉందని వైసీపీ నమ్ముతుంది.

ఈ సమయంలో… గాలి వాగ్ధానాలు, ఆచరణసాధ్యం కానీ హామీలవైపు కన్నెత్తి కూడా చూసే ఆలోచన చేయడం లేదని అంటున్నారు. పూర్తిగా పేద, మధ్య తరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమంతో పాటు… ప్రధానంగా యువతను దృష్టిలో పెట్టుకుని పారీశ్రామికరణకు పెద్ద పీట వేయాలని భావిస్తున్నారని తెలుస్తుంది. ఇక ఇప్పటికే ప్రారంభమైన పోర్టుల పనులుల్ తిరిగి అధికారంలోకి రాగానే శరవేగంగా పూర్తిచేసే అవకాశం ఉంది!