టాలీవుడ్ యువ నటులు ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్‌మీ’.’ఇఫ్ యు డేర్’ ఉపశీర్షిక. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. ఓ కుర్రాడు దెయ్యాన్ని ప్రేమించాలనుకుంటే ఎలా ఉంటుంది..ఏమవుతుందనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతుంది.
ఇప్పటికే మూవీ నుంచి టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాను మొదట ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనుకోని కారణాల వల్ల సినిమా తేదీ వాయిదా పడిరది. ఇప్పుడు తాజాగా మరో కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాను మే 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ చిత్రానికి కెమెరా: పీసీ శ్రీరామ్, సంగీతం: కీరవాణి, నిర్మాణ సంస్థ: దిల్‌రాజు ప్రొడక్షన్స్.ప్రస్తుతం రెండు రాష్టాల్ల్రో ఎన్నికల హంగామా, విపరీతమైన ఎండలు, దానికి తోడు ఐపీఎల్ క్రికెట్ మ్యాచులు ఒక దానితో పోటీ పడి మరోటి ఇలా చాలా అడ్డంకులు ఎదురవుతుండడంతో సినిమా చూడటానికి ప్రేక్షకులు వస్తారా అని చిన్న సందేహంతో వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ఈ హడావుడి అంతా ముగిశాక మే 25న ‘లవ్ మీ’ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.